రవితేజ సినిమాలకు ఓ లెక్క ఉంటుంది. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ, లవ్వూ.. ఇలా కొలతలు ఉంటాయి. ఆ కొలతలు ఇంచు కూడా కదలచ్చని మరో సినిమా… ‘టచ్ చేసి చూడు’. ట్రైలర్ చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది. రాశీఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 2న ఈ సినిమా విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్‌ని వదిలారు. ఫ్యామిలీ సీన్లతో కూల్ కూల్‌గా ట్రైలర్ మొదలైంది.. మెల్లమెల్లగా యాక్షన్‌లోకి దిగిపోయాడు రవితేజ ”యూనిఫామ్‌లో ఉంటే ఆరే బుల్లెట్లు.. యూనిఫామ్ తీసేస్తే దీనమ్మా.. రాయితో చంపుతానో రాడ్డుతో చంపుతానో నాకే తెలీదు” లాంటి డైలాగులతో మాస్మహారాజా.. మరోసారి రెచ్చిపోయాడు. విక్రమార్కుడులో రవితేజ పోలీస్‌గా కనిపించాడు. ఆ తరవాత.. ఆ అవతారంలో దర్శనమివ్వడం ఇదే తొలిసారి. వెన్నెల కిషోర్ బ్యాచ్… కావల్సినన్ని నవ్వులు పంచేసిందన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. రాశీఖన్నా మరోసారి గ్లామర్ ప్యాకేజీతో రెడీ అయిపోయింది. తెరపై భారీదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పక్కా మాస్ మసాలా సినిమా పడి చాలా రోజులైంది. ఆ లోటు… టచ్ చేసి చూడు తీర్చొచ్చేమో అనిపిస్తోంది.