లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల సర్వేలతో.. తనకు తానే ఓ విషమ పరీక్ష పెట్టుకున్నారు. తన సర్వేలపై ఉన్న నమ్మకం ఎలాంటిదో ఆయనకు బాగా తెలుసు. దాదాపుగా పాతికేళ్ల నుంచి ఆయన సర్వేలు అన్నీ కచ్చితత్వానికి మారుపేరుగా నిలిచాయి. అనేక సార్లు జాతీయ సర్వే సంస్థలు ప్రకటించిన వాటికి.. లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన వాటికి… చాలా తేడా ఉంది. ఆ సందర్భాల్లో.. జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి. కానీ.. లగడపాటివి మాత్రం కరెక్ట్ అయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే.. ఎప్పుడూ.. సరైన ఫలితాలను… ఉత్తరాది చానళ్లు ప్రకటించలేదు. చివరికి గత ఏపీ ఎన్నికల్లోనూ… వైసీపీనే గెలుస్తుందని.. ఆయా చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. తర్వాత మొత్తం రివర్స్ అయింది.
అక్కడి వరకూ ఎందుకు.. ఇటీవలి కాలంలో కూడా ఉత్తరాది సర్వే సంస్థలు తప్పులో కాలేశాయి. కర్ణాటకలో ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోయింది. అలాగే నంద్యాల ఉపఎన్నికల్లో కానీ.. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ .. తన ఉత్తరాది టీంతో చేయించిన సర్వేల్లో వైసీపీనే గెలుస్తుదని తేల్చారు. అందుకే జగన్ నంద్యాల ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు. కానీ లగడపాటి మాత్ర..మెజార్టీతో సహా లెక్క చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లోలానే… నంద్యాల ఎన్నికల్లో కూడా..ఎవరిదో విజయం అని ఊహించలేని పరిస్థితి ఉంది. జగన్.. రెండు వారాలు నంద్యాల్లోనే మకాం వేసి గల్లీ గల్లీ తిరిగారు. నేతలందర్నీ మోహరించిన తర్వాత.. హోరాహోరీ పోరు జరుగుతుందని అనుకున్నారు. కానీ లగడపాటి రాగోపాల్ మాత్రం ఆర్జీ ప్లాష్ టీం ద్వారా సర్వే జరిపి.. టీడీపీకి 27 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పారు. ఫలితాల్లో అదే నిజం అయింది. తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ.. కచ్చితంగా అంచనా వేశారు.
కానీ ఇప్పుడు మరింత భిన్నమైన పరిస్థితిని లగడపాటి ఎదుర్కొంటున్నారు. ఒక్క జాతీయ టీవీ చానల్ కూడా.. టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలేదు. లగడపాటి రాజగోపాల్ మాత్రమే చెబుతున్నారు. ఇప్పటి వరకూ లగడపాటి రాజగోపాల్ సర్వేలంటే… అందరికీ ఎనలేని నమ్మకం. రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా.. ఫలితాలు వస్తే… లగడపాటి విశ్వసనీయత అమాంతం పెరుగుతుంది. లేకపోతే… ఎంతో కాలం నుంచి తెట్టి పెట్టుకున్న క్రెడిబులిటీ.. రిస్క్ లో పడుతుంది. ఆయనను ఇప్పటికీ .. తెలంగాణ వ్యతిరేకిగా టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే.. ఈ ముద్ర మరింత బలంగా పడుతుంది. ఓ రకంగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా తనకు తానే విషమ పరీక్ష పెట్టుకున్నారని చెప్పుకోవాలి.