‘దేవర’ తరవాత ‘వార్ 2’ షూటింగ్లో బిజీ అయిపోయాడు ఎన్టీఆర్. మరోవైపు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన రంగం సిద్ధం అవుతోంది. సంక్రాంతి తరవాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఓ కథానాయికగా ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది. మరో కథానాయికగా రష్మికని ఎంచుకొనే ఛాన్స్ వుందని సమాచారం.
అయితే ఈ సినిమాలో ఇద్దరు మలయాళ స్టార్లకు చోటు దొరికింది. ఒకరు బీజూ మీనన్, మరొకరు టొవినో థామస్. మలయాళ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్స్ అనదగ్గ స్టార్స్ వీళ్లు. వీరిద్దరి రాకతో.. ఈ సినిమాకు మరింత వన్నె వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో వుంది. అయితే అధికారికంగా ఖరారు కాలేదు. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ యేడాది ఎన్టీఆర్ నుంచి ‘వార్ 2’ రాబోతోంది. మరో నాలుగు నెలల తరవాత ప్రశాంత్ నీల్ సినిమా వస్తుంది.