టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ విషయంలో ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంభిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మాట కంటే ముందు ఆయన కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌కు వెళ్తున్నారు. ఏ కార్యక్రమం అయినా అక్కడి నుంచి ప్రారంభిచాలన్నట్లుగా ప్రయతనిస్తోంది. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు .. రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ పోలీస్ స్టేషన్లలోఫిర్యాదుచేయాలని పిలుపునిచ్చారు. అలాగే తాను కూడా చేశారు. ఇలా ఫిర్యాదు చేయడానికి రేవంత్ రెడ్డి నేరుగా గజ్వేల్ వెళ్లారు.
గజ్వేల్‌లో కేసీఆర్‌పై అసంతృప్తి ఉందన రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన చలో గజ్వేల్ అంటున్నారు. ఇటీవల రచ్చబండను కూడా గజ్వేల్‌లోనే నిర్వహించాలనుకున్నారు. కానీపోలీసలు అడ్డుకున్నారు. ఇటీవల సిద్దిపేట కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. బూత్‌ల వారీగా పరిస్థితుల్ని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ సీఎం హోదాలో ఉండటంతో నియోజకవర్గాన్ని పట్టించుకోలేకపోతున్నారు.
బాధ్యతల్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత తనపై రెండు సార్లు పోటీ ఓడిపోయిన ప్రతాప్ రెడ్డిని పార్టీలోచేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన పెత్తనం చేస్తున్నారు. రేవంత్ దూకుడు చూస్తూంటే కేసీఆర్ గజ్వేల్‌కు గుడ్ బై చెబుతారని కాంగ్రెస్ నేతలంటున్నారు. మాజీఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ తరపున చురుకుగా తిరుగుతున్నారు.