చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ వందో సినిమా ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడతాయి అని తెలిసినవెంటనే ఆయా హీరోల అభిమానులకు ఎలా ఉన్నా తెలుగు సినిమా లవర్స్‌కి మాత్రం ఎక్సైటింగ్‌గా అనిపించింది. శాతకర్ణి ట్రేైలర్ రిలీజ్ అవ్వకముందు వరకూ ఖైదీ నంబర్ 150 సినిమాకే ట్రేడ్ వర్గాలు ఓటేశాయి. చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కావడం, అది కూడా పక్కా మాస్ మసాలా సినిమా కావడంతో ఎక్కువ మంది ఖైదీకే ఓటేశారు. తమిళ్లో వంద కోట్లు కొల్లగొట్టిన కథ కావడం కూడా సూపర్ పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. అన్నింటికీ మించి 60 ఏళ్ళ వయసులో చిరంజీవి చూపించిన మేకోవర్ అయితే ఫ్యాన్స్‌ని కిర్రెక్కించింది. శాతకర్ణి సినిమా మాస్ అభిమానులకు కనెక్ట్ అయ్యే అవకాశాలపైన డౌట్స్ ఉండడం కూడా ఖైదీకి కలిసొచ్చింది.
అయితే ఈ లెక్కలన్నింటినీ కూడా ఒక్క ట్రైలర్‌తో కొట్టి పడేశాడు క్రిష్. కేవలం ఆరు నుంచి ఎనిమిది నెలల కాలంలో క్రిష్ ఇచ్చిన అవుట్ పుట్‌కి రాజమౌళి కూడా షాక్ అయ్యాడు. క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా సినిమా లవర్స్ అందరికీ శాతకర్ణి ట్రేైలర్ నచ్చింది. ఇనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘మరణమా..రణమా’ అనే డైలాగ్ అయితే బాలకృష్ణ హార్డ్ కోర్ అభిమానులకు, మాస్ జనాలకు హాంట్ చేసి పడేసింది. అదే టైంలో ఖైదీ నంబర్ 150లో చిరంజీవి చెప్పిన ‘చేస్తా…చూస్తా…కోస్తా….’ డైలాగ్ మాత్రం దశాబ్ధం క్రితమే పూర్తిగా ఎటకారమైపోయిన బాలకృష్ణ సినిమాల తరహాలో ఉండి డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మొత్తం బిజినెస్ పైన చూపిస్తోందని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తున్నారు. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌లో ఎక్కువ మంది శాతకర్ణి సినిమాకే ఓటేస్తున్నారు. సాయి కొర్రపాటి లాంటి బిగ్ షాట్స్ అయితే ఫ్యాన్సీ రేట్లకు కొనేస్తున్నారు. మరోవైపు ఖైదీ నంబర్ 150 సినిమాకి మాత్రం వ్యవహారం రివర్స్‌లో నడుస్తోంది. ప్రి రిలీజ్ బిజినెస్సే వందకోట్ల రేంజ్లో టార్గెట్ చేసిన ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కూడా ఇఫ్పుడు చాలా ఏరియాలు ఓన్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా ధృవ సినిమా విషయంలో కూడా చెప్పినంతరేటుకి కొనడానికి బయ్యర్స్ వెనకడుగు వేసిన నేపథ్యంలో అల్లు అరవిందే సొంతంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి కూడా అదే పద్ధతి ఫాలో అయిపోయేలా ఉన్నారు. ఈ రెండు సినిమాల విషయం ఎలా ఉన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం గత రెండు సంవత్సరాలుగా ఓ గొప్ప మార్పు అయితే కనిపిస్తోంది. హీరోల బిల్డప్పులు, హీరోయిజం కోసం తీసుకునే సినిమాల క్రేజ్ బాగా డౌన్ అయిపోయింది. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనే పరిస్థితులు వచ్చాయి. గమ్యం, వేదం, కంచె సినిమాల డైరెక్టర్ క్రిష్ కూడా ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని ప్రూవ్ చేశాడు.