ఈరోజు ఉదయం హర్యానా రాష్ట్రంలో పల్వాల్ జిల్లాలో భగోల గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్ళు డ్డీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లోకల్ రైలు డ్రైవర్ తో సహా మొత్తం ముగ్గురు మరణించారు. సుమారు 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఒక ట్రాక్ రిపేరు జరుగుతున్న కారణంగా సిగ్నలింగ్ సిబ్బంది పొరపాటున ఒకే ట్రాక్ మీదకు లోకల్ రైలును, దానికి ఎదురుగా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ను పంపించడంతో ఈ ప్రమాదం జరిగింది. పైగా ఆ సమయంలో విపరీతమయిన మంచు కమ్ముకొని ఉండటంతో ఎదురుగా వస్తున్న రైలును డ్రైవర్లు సకాలంలో గుర్తించలేకపోయారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తర్ జిల్లా కమీషనర్ తో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు, తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను ఫరీదాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించేరు. ఈ ప్రమాదం జరిగిన భగోల గ్రామం డిల్లీకి సుమారు 80 కిమీ దూరంలో ఉంది.
హెల్ప్ లైన్ నెంబర్లు: న్యూ డిల్లీ: 1072, 011-23341074; హజ్రత్ నిజాముద్దీన్: 011-23459748.