విశాఖలో ఆదివారం ఆహ్లాదంగా బీచ్ ఒడ్డున గడపాలనుకున్న ప్రజలకు ఆందోళన కనిపించే దృశ్యాలు కనిపించాయి. సముద్రం ఒక్క సారిగా ముందుకు వచ్చింది. మరో చోట పూర్తిగా వెనక్కి వెళ్లింది. అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసి, సముద్రం తీరం వైపు చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి బీచ్‌రోడ్డులోని చిల్డ్రన్‌పార్క్ ప్రహరీకూలిపోయింది. సుమారు 500 అడుగుల పొడవున 2-3 అడుగుల లోతున మట్టి జారిపోయింది. మరో చోట గతంలో కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ ఉన్న చోట సముద్రం వెనక్కి పోయింది. దీంతో ఆ ఓడ రాళ్లపై ఉన్నట్లుగా నిలబడింది. ఇవన్నీ విశాఖ వాసులకు దడ పుట్టించారు.
అమావాస్య కారణంగా అలా అలలు వస్తాయి కానీ.. ఇప్పుడు మాత్రం తీవ్ర పెరిగింది. ప్రజలు ఆందోళన చెందడానికి మరోకారణం కూడా ఉంది. రాబోయే వందేళ్లలో దేశంలోని 12 తీర నగరాలు.. మునుగుతాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చెబుతోంది. ఇండియాలో విశాఖ, చెన్నై, ముంబై, కాండ్లలో సముద్రమట్టాలు 2 అడుగుల వరకూ పెరుగుతాయని.. ప్రతి ఏటా ౩ మిల్లీమీటర్లు పైకి వస్తుందని లెక్కలేసింది. 2100 నాటికి దేశంలోని 12 నగరాల్లో 2 అడుగుల పైన సముద్రం పెరుగుతుందని తెలిపింది. అలా జరిగితే ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతాయి.
ఏ ప్రభుత్వం ఉన్నా ఇష్టారాజ్యంగా బీచ్‌లను ధ్వంసం చేయడం.. సీఆర్‌జెడ్ నిబంధనలు పాటించకుడా సొంత వ్యాపారాల కోసం ఎంతకైా తెగించడం.. ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూండటంతో మొదటికే మోసం వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే.. ప్రజలు ఇబ్బంది పడతారు. విశాఖ నగరం ఇబ్బంది పడుతుంది.