శ్రీదేవి మరణవార్త యావత్ సినీ ప్రపంచాన్ని షాక్లో ముంచెత్తింది. శనివారం రాత్రి 11.30 ని.లకే శ్రీదేవి మరణించినా, ఆ వార్త బయటకు కాస్త ఆలస్యంగా వచ్చింది. అప్పటికే ప్రింట్ మీడియా డెడ్లైన్ ముగియడంతో…. కవరేజీ సోమవారానికి షిఫ్ట్ అయ్యింది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలతో పాటు ఇంగ్లిష్ డైలీలు శ్రీదేవి కవరేజీలతో హోరెత్తించాయి. ఈనాడు అయితే ఏకంగా ఆరు పేజీలను కేటాయించింది. అక్కినేని నాగేశ్వరరావు మరణానికి ఇచ్చిన కవరేజీతో సమానంగా శ్రీదేవికి వీడ్కోలు పలికింది. సాక్షి, ఆంధ్రజ్యోతిలలోనూ విభిన్న కథనాలు వచ్చాయి. కొన్ని విదేశీ పత్రికలు కూడా శ్రీదేవి వార్తల్ని హైలెట్ చేశాయి. శ్రీదేవి దుబాయ్లో చనిపోవడంతో అక్కడి మీడియాకు ఇదే హాట్ న్యూస్ అయ్యింది. గల్ఫ్ టైమ్స్ పాత్రిక కవర్ పేజీపై శ్రీదేవి బొమ్మ ముద్రించి, అందులోని సగం పేజీల్లో శ్రీదేవి వార్తల్ని నింపేసింది. దాదాపుగా దుబాయ్ పత్రికలన్నీ ఆమె మరణ వార్తనే హైలెట్ చేశాయి. ఇక టీవీ ఛానళ్ల సంగతి చెప్పక్కర్లెద్దు. ఏ ఛానల్ చూసినా.. శ్రీదేవి బొమ్మే. ఫేస్బుక్, ట్విట్టర్… ఇలా ఏం చూసినా శ్రీదేవే! మొత్తానికి అతిలోక సుందరికి మీడియా లోకం మొత్తం చేయొత్తి సలాం చేసింది. జోహార్ అంటూ.. ఘనమైన వీడ్కోలు పలికింది.