వారానికి కనీసం రెండు సినిమాలు విడుదలౌతాయి. ఆ సినిమా విడుదలైన వెంటనే సక్సెస్ మీట్ పెడతారు మేకర్స్. సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు. ఇది నగ్నసత్యం. ఈ మాట మీడియా రాస్తే మీడియాకు ఏం తెలుసు? ఫుట్ పాల్స్ బాగున్నాయి, మా బడ్జెట్ కి వర్క్ అవుట్ అయింది అని చెప్తారు నిర్మాతలు. కానీ వాస్తవం మాత్రం అది కాదు. ఇదే విషయం డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నిర్మొహమాటంగా చెప్పారు.
త్రినాధ్ నక్కిన నిర్మాతగా చేసిన సినిమా చౌర్యపాఠం. ఈ సినిమా వచ్చేవారం రిలీజ్ కి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ‘జనాలు థియేటర్స్ కి రావడం లేదు. షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. సెకండ్ షోలని ఎత్తేశారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను స్వయంగా థియేటర్స్ కి వెళ్లి చూశాను. సినిమాలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్టార్ల సినిమాలకే జనం రావడం లేదు. ఇక కొత్త వారితో సినిమా చేస్తున్న నిర్మాత పరిస్థితి ఇంకా దారణం’ అని నిట్టూర్చారు. త్రినాధ్ నాథ్ నక్కిన ధమాకా తో వందకోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్. అలాంటి దర్శకుడే ప్రస్తుతం థియేటర్స్ అసలు పరిస్థితి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.