త్రినాథరావు నక్కినని బిగ్ లీగ్ లోకి చేర్చిన సినిమా ‘ధమాకా’. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ‘ధమాకా’ వంద కోట్లు సాధించి రవితేజ కెరీర్‌కి మళ్లీ ఊపిరి పోసింది. ఇప్పుడు త్రినాథరావు సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రసన్న కుమార్ స్క్రిప్టు అందించారు. ‘సామజవరగమన’ లాంటి సూపర్ హిట్ తీసిన రాజేష్ దండా నిర్మాత. ఈ చిత్రానికి `మజాకా` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ‘స్టిల్ బ్యాచిలర్’, ‘రింగ్ మాస్టర్’ లాంటి పేర్లు కూడా పరిశీలకు వచ్చాయి. అయితే ‘ధమాకా’ సౌండింగ్ ‘మజాకా’లో కనిపించడంతో.. ‘మజాకా’కు ఫిక్స్ అయ్యారు.
తండ్రీ కొడుకుల కథ ఇది. రావురమేష్, సందీప్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. రావు రమేష్ పక్కన ‘మన్మథుడు’ ఫేమ్ అన్షుని తీసుకొచ్చారు. సందీప్ సరసన రీతూవర్మని ఎంచుకొన్నారు. ‘ధమాకా’కు మంచి పాటలు అందించిన భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈనెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.