వరుణ్‌తేజ్ `గని` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా మరి కొన్ని కథల్ని సెటప్ చేసుకొనే పనిలో బిజీగా ఉన్నాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా ఓకే అయ్యిందన్నది టాలీవుడ్ టాక్. మరోవైపు `గని` నిర్మాతతోనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నాడని తెలుస్తోంది. `భీమ్లా నాయక్` దర్శకుడు సాగర్ చంద్ర ఇదివరకెప్పుడో వరుణ్‌కి ఓ కథ చెప్పాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమా చేయడానికి రెడీగానే ఉంది. ఇప్పుడు మరో దర్శకుడి కథకీ వరుణ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. తనే త్రినాథరావు నక్కిన.
ప్రస్తుతం రవితేజతో `ధమాకా` చేస్తున్నాడు త్రినాథరావు. అది పూర్తయిన వెంటనే… వరుణ్ తో సినిమా ఉండబోతోందని టాక్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథ, మాటలు అందించనున్నాడని తెలుస్తోంది. త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్`, `హలో గురూ ప్రేమకోసమే`, `థమాకా`లకు… ప్రసన్నకుమారే రచయిత. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకోనుంది.