జాంబిరెడ్డితో ఓ మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకొన్నాడు తేజా సజ్జా. ఇప్పుడు తన కెరీర్‌ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కథల విషయంలో, దర్శకుల ఎంపికలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం `హనుమాన్` అవతారం ఎత్తబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరవాత ఎవరితో సినిమా చేయాలన్న దానిపై తేజా స్పష్టతతోనే ఉన్నాడు.
త్రినాథరావు నక్కిన తేజాకు ఓ కథ చెప్పాడు. అది దాదాపుగా ఓకే అయిపోయింది. ప్రస్తుతం త్రినాథరావు రవితేజతో `ధమాకా` రూపొందిస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. దీని తరవాత.. తేజతోనే సినిమా ఉండొచ్చు. మరోవైపు కార్తీక్ ఘట్టమనేని కూడా ఓ కథ తయారు చేశాడు. తేజా కోసం. ఈ కాంబో కూడా దాదాపు ఓకే అయిపోయినట్టే.