హైదరాబాద్ సిటీలో సింగిల్ బెడ్ రూం ఇళ్లు ఉంటే చాలనుకునేవాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. కొనుక్కుంటే కాస్త సౌకర్యంగా ఉండేలా కొనుక్కోవాలని అనుకుంటున్నారు. పిల్లలకు ప్రైవసీ ఉండేలా ఇద్దరు పిల్లలు ఉంటే ఖచ్చితంగా త్రిబుల్ బెడ్ రూం ఇల్లు ఉండాలని అనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వచ్చే ఎంక్వయిరీల్లో త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించే ఎక్కువ ఉంటున్నాయని రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం హైరైజ్ అపార్టుమెంట్లలో డబుల్ బెడ్ రూం ప్లాన్స్ పరిమితంగానే ఉంటున్నాయి. ఓ మాదిరి ఆపార్టుమెంట్లలోనూ త్రిబుల్ బెడ్ రూం ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం జీవనం సౌకర్యవంతంగా మార్చడం కోసం రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. పని మనుషుల మీద ఆధారపడాలనుకోవడం లేదు. అలాగే హోంఎంటర్ టైన్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా అన్నీ పరిశీలించుకుంటే.. ఎక్కువగా త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకే ఎక్కువగాప్రాధాన్యం ఇస్తున్నారు. చాలా మంది ఇప్పుడు తాము ఉంటున్న డబుల్ బెడ్ రూంను అమ్మేసి.. త్రిబుల్ బెడ్ రూం కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సింగిల్ బెడ్ రూం ఉంటే ఎలాగోలా సర్దుకుపోవచ్చని అనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది.
కాలం మారే కొద్దీ ప్రజల అభిరుచులు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు ఇరుకుగా అయినా సర్దుకుపోతున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి వారు పర్సనల్ స్పేస్ ఉండాలనుకుంటున్నారు. అలాగే కుటుంబసభ్యులైనా సరే ఎవరి స్పేస్ వారికి ఉండాలన్న ఆలోచనకు వస్తున్నారు. ఫలితంగా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఓ బెడ్ రూం ఉండాల్సి వస్తోంది. ఈ మార్పు .. మార్కెట్ ట్రెండ్స్ లోనూ కనిపిస్తోంది. కనీసం త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ అయినా ఉండేలా చూసుకోవాలని సగటు మధ్యతరగతి మనస్థత్వం మార్పునకు లోనవుతోంది. భవిష్యత్ లో డబుల్ బెడ్ రూం కన్నా.. త్రిబుల్ బెడ్ ఫ్లాట్ల నిర్మాణమే అత్యధికంగా ఉండే అవకాశం ఉంది.