త్రిష నటించిన నాయకి ఈమధ్యే విడుదలైంది. సినిమా ఫ్లాపనుకోండి. కానీ ఈ సినిమాపై త్రిష చాలా ఆశలే పెట్టుకొంది. భారీ స్కెచ్ వేసింది. ఈ చిత్రానికి త్రిష మేనేజర్ గిరిధర్ నిర్మాత. మేనేజర్ కోసం ఓ సినిమా చేసినట్టుంటుంది… దాంతో పాటు భారీగానూ పారితోషికం ముడుతుందని ప్లాన్ వేసింది త్రిష. ఈ సినిమా కోసం త్రిష పారితోషికం ఏం తీసుకోలేదు. తమిళ రైట్స్ లో సగం వాటా మాత్రం అడిగిందట. తమిళంలో ఈసినిమా కనీసం రూ.6 కోట్లకైనా అమ్ముడు పోతుందన్నది త్రిష ఆలోచన. ఆ లెక్కన… మూడు కోట్ల పారితోషికం అందుకోవొచ్చు. కథానాయికగా నటిస్తే.. త్రిషకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోటి రూపాయలు కూడా దక్కవు. కాబట్టి ఇది మంచి ప్లానే.
కానీ… త్రిష ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ సినిమాకి తమిళంలో ఏమాత్రం మార్కెట్ జరగలేదు. పైపెచ్చు చాలాచోట్ల నిర్మాత సొంత డబ్బులతో రిలీజ్ చేసుకొన్నాడు. అలాంటప్పుడు త్రిషకు వేరేగా పారితోషికం ఎక్కడ ఇవ్వగలడు? అందుకే ఈ విషయంపై త్రిషకూ, మేనేజర్ గిరిధర్కీ మధ్య గ్యాప్ వచ్చేసిందని, అందుకే త్రిష ప్రచారానికి కూడా డుమ్మా కొట్టేసిందని టాక్. నాయకి విడుదలకు ముందు రోజు ఈ సినిమాని ఎలాగైనా ఆపేయాలని త్రిష తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. కానీ అది కుదర్లేదు. ఇంతా చేస్తే ఈ సినిమా ద్వారా త్రిషకు రూ.30 లక్షలకు మించి ఎక్కువ గిట్టుబాటు కాలేదట. మూడు కోట్లకు గాలం వేస్తే.. 30 లక్షలు ముట్టినందుకు త్రిష చాలా ఫీలైపోతుందని, ఇక మీదట… ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యిందని టాక్.