హీరోయిన్గా ఎన్ని కమర్షియల్ చిత్రాలు చేసినప్పటికీ, ఒక్క లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ సక్సెస్ అయితే వచ్చే పేరు ఇంకో రకంగా ఉంటుంది. ఒక రకంగా అనుష్కకు , నయనతారకు దక్షిణాదిన సూపర్ హీరోయిన్ల ఇమేజ్ను తెచ్చినవి లేడీ ఓరియంటెడ్ సినిమాలే. అయితే వాళ్లిద్దరికీ సమకాలీనురాలయిన త్రిషకు మాత్రం ఇంకా అది అందని ద్రాక్ష పండులాగానే ఉంది. కెరీర్ మొదలైనప్పటి నుంచి కమర్షియల్ చిత్రాలు, హృద్యమైన ప్రేమ కథా చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఆమెకు లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా ఇప్పటిదాకా సరైన హిట్ పడలేదు. `96` తో మంచి పేరు తెచ్చుకున్న ఈ చెన్నై సుందరి తాజాగా లేడీ ఓరియంటెడ్ నాయిక ఇమేజ్ కోసమే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇంకో ట్రయల్ కూడా వేస్తున్నారు. అయితే ఈ సారి గురి చూసి కొట్టాలని బాగా ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సంతకం చేశారు. త్రిష బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అయ్యే విధంగా దర్శకుడు శరవణన్ ఓ మంచి స్టోరీని ప్రిపేర్ చేశారట. కథ వినగానే త్రిషకు నచ్చేసిందట. ఆమెకు సూట్ అవుతూనే పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అని వినికిడి. శరవణన్ గతంలో తెలుగులో రామ్ హీరోగా `గణేష్`, శర్వానంద్ హీరోగా `జర్నీ` చిత్రాలకు దర్శకత్వం వహించారు.