ఈమధ్య రజనీకాంత్ టైమేమీ బాగోలేదు. బాక్సాఫీసు దగ్గర సినిమాలన్నీ బక్కెట్ తన్నేస్తున్నాయి. రావల్సిన `రోబో 2` వాయిదా పడుతూ వస్తోంది. కథానాయికల ఎంపికలోనూ దర్శక నిర్మాతలు తప్పులు చేస్తున్నారు. రజనీ ఇమేజ్‌కీ, క్రేజ్కీ సరిపడా కథానాయికల్ని ఎంచుకోవడంలో చిత్రబృందాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఈసారి మాత్రం ఆ తప్పు చేయదలచుకోలేదేమో.. కథానాయిక విషయంలో మాత్రం రజనీ జాగ్రత్త పడిపోయాడు. రజనీకాంత్ – కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా త్రిషని ఎంచుకున్నారు. వీరిద్దరి జోడీ చూడడం ఇదే తొలిసారి. ఈ సినిమా కోసం ముందు నుంచీ స్టార్ హీరోయిన్నే తీసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నారు దర్శక నిర్మాతలు. కొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించిన పిదప.. ఆ అవకాశం త్రిషకు కట్టబెట్టారు. అన్నట్టు… అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తన పాత్రలో నెగిటీష్ షేడ్స్ కనిపిస్తాయని, ఓ విధంగా ఈ సినిమాకి ప్రతినాయక పాత్ర తనదే అని సమాచారం.