త్రిష వయసు 41 ఏళ్లు. ఓరకంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చాలా కాలంగా త్రిష పెళ్లి గురించిన రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలోనే త్రిష పెళ్లి చేసుకోబోతోందని, ఓ వ్యాపార వేత్తతో కొత్త జీవితం ప్రారంభించబోతోందని గుసగుసలు వినిపించాయి. వీటిపై త్రిష క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి పై తనకు నమ్మకాలు లేవని బాంబ్ బ్లాస్ట్ చేసింది. ఓరకంగా ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉండిపోతానన్న సంకేతాల్ని పంపింది. ఆమె నటించిన ‘థగ్స్ లైఫ్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా త్రిష పెళ్లిపై ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె నేరుగా సమాధానం చెప్పేశారు. ”నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు. పెళ్లి అయినా, కాకపోయినా పెద్దగా సమస్య లేదు” అంటూ తన నిరాసక్తత వ్యక్తం చేశారు. ఇది వరకు కూడా పెళ్లిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు త్రిష. పెళ్లి చేసుకొని చాలామంది కష్టాలు కొని తెచ్చుకొన్నారని, వాళ్ల జీవితాల్ని దగ్గర్నుంచి చూశానని, పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకోవడం వల్ల జీవితంలో కొత్త సమస్యలు వస్తాయని, సాఫీగా సాగుతున్న జీవితంలో అలజడులు రేగుతాయని అందుకే పెళ్లంటే భయం ఏర్పడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె. ఇప్పటికీ పెళ్లిపై ఆమె అభిప్రాయం మారలేదు.
త్రిషకు పెళ్లి ఇష్టం లేకపోయినా, ఆమెపై కొన్ని గాసిప్పులు విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఓ హీరోతో క్లోజ్ రిలేషన్ షిప్ లో ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకొన్నారని, అయితే ఆ ప్రేమ సుఖాంతం కాలేదని, అప్పటి నుంచీ పెళ్లిపై, రిలేషన్ షిప్ పై తన అభిప్రాయం బాగా మారిందన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. ఓరకంగా త్రిషకు పెళ్లీడు దాటిపోయింది. థర్టీస్‌లో ఉండి ఉంటే.. పెళ్లిపై అభిప్రాయం మరోలా ఉండేదేమో? ప్రస్తుతం తన కెరీర్ పీక్స్‌లో వుంది. 41 ఏళ్లొచ్చినా కెరీర్ జెట్ స్పీడులో సాగుతోంది. కొత్తతరం కథానాయికలతో పోటీ పడుతోంది. ఇలాంటప్పుడు పెళ్లి గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది?