దశాబ్ద కాలం నుండి టాలీవుడ్ కోలీవుడ్ లలో క్రేజీ బ్యూటీగా అభిమానులను సంపాధించుకున్న త్రిష మధ్యలో కాస్త కెరియర్ అయిపోయింది అనుకున్నారంతా.. సౌత్ స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ ఉన్నా ఎందుకో అమ్మడు వెనక్కు తగ్గింది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో రెచ్చిపోతుందనుకోండి. వైవిధ్యమైన సినిమాలను చేస్తూ దూసుకెళ్తున్నత్రిష ప్రస్తుతం నాయకి, చీకటి రాజ్యం సినిమాల్లో నటిస్తుంది. నాయకిలో డిఫరెంట్ గా కనబడుతున్న త్రిష లోకనాయకుడు చీకటి రాజ్యంలో కూడా సరికొత్త పాత్రలో దర్శనమిస్తుంది.
చీకటి రాజ్యంలో తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకున్న త్రిష వరుణ్ మణియన్ తో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుని ఫుల్ గా సినిమాల మీద ఫోకస్ పెట్టింది. అయితే దాదాపు టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన త్రిష ఒక్క తమిళ తలైవాతోనే నటించలేదని తెగ ఫీలై పోతుంది. కేవలం రజినితో తప్ప మిగతా తమిళ, తెలుగు హీరోలందరితో నటించిన త్రిష తనకు రజినికాంత్ తో కలిసి నటించాలనుందని అంటుంది.
తమిళ తలైవా సినిమాలో ఛాన్స్ రావాలే కాని అప్పుడు జీవితానికి పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెబుతుంది. ప్రస్తుతం నటిస్తున్న నాయకి, చీకటి రాజ్యం రెండు సినిమాలు హిట్ అందుకుంటే అమ్మడు అన్నట్టు రజిని సినిమా ఛాన్స్ వచ్చినా రావోచ్చు ఏమంటారు రీడర్స్…