నాయకి సినిమా ఫ్లాప్‌తో డీలా పడిపోయింది త్రిష. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం అటుంచితే.. పారితోషికం ఇవ్వకుండా నిర్మాత కూడా హ్యాండివ్వడంతో త్రిష కృంగిపోయింది. ఇప్పుడు త్రిషకు మరో షాక్. ఆమె చేతికి మెగా ఛాన్స్ అందినట్టే అంది చేజారిపోయింది. కత్తి రీమేక్‌లో చిరు సరసన హీరోయిన్ల కోసం వేట సాగిస్తోంది చిత్రబృందం. ఓ దశలో… త్రిషని తీసుకొంటే ఎలా ఉంటుంది?? అని చిత్రబృందం ఆలోచించినట్టు టాక్. చిరుతో కలసి స్టాలిన్‌లో నటించింది త్రిష. వినాయక్ సినిమా కృష్ణలో రవితేజ సరసన జోడీ కట్టింది. సో అటు వినాయక్‌కీ ఇటు చిరుకీ త్రిషతో రాపో బాగానే ఉంది. అందుకోసమే… ఒకవేళ తప్పని పరిస్థితి వస్తే.. త్రిషని తీసేసుకొందాం అనుకొన్నాడు వినాయక్. అయితే.. నాయకి విడుదలై.. ఫ్లాప్ అవ్వడంతో వినాయక్ వెనకడుగు వేశాడట. ఓ ఫ్లాప్ సినిమా హీరోయిన్ ని తీసుకొంటే… చిరు సినిమాపై నెగిటీవ్ ఇంపాక్ట్ పడుతుందని వినాయక్ భావించాడట. అందుకే లిస్టులోంచి త్రిష పేరు… పక్కన పెట్టేశారట. త్రిష కూడా డ్రాప్ అవ్వడంతో కథానాయికగా అవకాశాల్ని కాజల్ మరింత మెరుగు పర్చుకొంది. ఇటీవల వినాయక్ కాజల్‌ని కలిసినట్టు టాలీవుడ్ టాక్. అయితే పారితోషికం విషయం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం వల్ల.. కాజల్ పేరు సందిగ్థంలో ఉంది. ఏదేమైనా వారం పది రోజుల్లో కథానాయిక పేరు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.