త్రిష పెళ్లి అనేది ఇప్పటి ముచ్చట కాదు. గాసిప్ రాయుళ్లకు త్రిష పెళ్లి ఓ నిత్యావసర వస్తువు. ఈమధ్య కూడా త్రిష పెళ్లిపై బోలెడన్ని మసాలా వార్తలు బయటకు వచ్చాయి. త్రిష – శింబులు మళ్లీ కలిసిపోయారని, వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయమని వార్తలు పుట్టించారు. ఎట్టకేలకు ఈ పెళ్లి వార్తలపై త్రిష స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయమై త్రిష మాట్లాడుతూ……
“పెళ్లి చేసుకోనని నేనెప్పుడూ చెప్పలేదు.. తప్పకుండా చేసుకుంటా. నా ఇష్టాల్నీ, నా అభిరుచుల్నీ, నా వృత్తినీ గౌరవించేవాడ్ని పెళ్లి చేసుకుంటా. ఒకవేళ అలాంటివాడు దొరక్కపోతే.. అసలు పెళ్లే చేసుకోను. జీవితాంతం ఒంటరిగా ఉండడానికి సైతం నేను సిద్ధమే” అని చెప్పుకొచ్చింది. ఒంటరిగా బతికే ధైర్యం, తెగువ తనకున్నాయని, ఆడవాళ్లు ఎవరి తోడూ లేకుండా మనుగడ సాధించగలరని త్రిష నమ్మకంగా చెబుతోంది. చూస్తుంటే బ్రహ్మచారిణిగా మిగిలిపోవడానికి త్రిష గట్టిగానే ఫిక్సయిపోయినట్టుంది.