దశాబ్ధ కాలంగా సూపర్ ఫాంలో ఉన్న హీరోయిన్ త్రిషకు ఓ ఊహించని షాక్ ఒకటి ఈ మధ్య జరిగిందట. కెరియర్ ముగించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో ఆ పెళ్లి కాస్త పెటాకులయ్యే సరికి అమ్మడిక సినిమాల మీదే ఫుల్ ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసింది. అయితే ఎలాగు అవకాశాలు సన్నగిల్లాయి కదా వచ్చిన అవకాశాన్నే అన్ని విధాలుగా వాడుకునేందుకు అమ్మడు ప్రయత్నిస్తుంది. ఆ దారిలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన అరణ్మయి-2 తెలుగులో కళావతిగా రిలీజ్ అయిన సినిమాలో త్రిష తడిసిన అందాతో ప్రేక్షకులకు మత్తెక్కేలా చేసింది.
అయితే ఈ వేడిలో ఆమెను బి గ్రేడ్ సినిమాల్లో నటించేస్తే ఎలా ఉంటుంది అని కొందరు బి గ్రేడ్ దర్శక నిర్మాతలు త్రిషను సంప్రదించారట. అంతేకాదు ఆ సినిమా కోసం అమ్మడికి ఓ రేంజ్ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారని తెలుస్తుంది. ఎంత భారీ ఆఫర్ ఇచ్చినా అలాంటి సినిమాల్లో చేసేది లేదని.. అవసరమైతే చేయబోయే సినిమాల్లో అసలు గ్లామర్ షో చేయనని తెగేసి చెప్పిందట త్రిష.
అసలు త్రిషను బి గ్రేడ్ సినిమా కోసం అడగాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏమో కాని ఆ నిర్మాతలకు త్రిష ఘాటైన సమాధానం ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో హాట్ న్యూస్ నడుస్తుంది. ఓ రకంగా త్రిషకు ఇదో మంచి అనుభవం అని చెప్పాలి.