పాపం.. త్రిషకు పెద్ద కష్టమే వచ్చింది. జల్లికట్టు వేడి ఆమెకు తాకింది. తమిళనాడులో జల్లికట్టుకి అనుకూలంగా పలువురు అందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నో చెప్పినప్పటికీ, కొంతమంది నాయకులు, ప్రముఖులు సంప్రదాయ క్రీడ జల్లికట్టుని నిషేధించడం తగదంటూ భహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. హీరో కమల్ హసన్ అయితే.. తమిళుడినైనందుకు గర్విస్తానని, ఇది తమ సంస్కృతి అని, తనకు జల్లికట్టు అంటే ఎంతో ఇష్టమని, ఒకవేళ జల్లికట్టును నిషేధించాలని అనుకుంటే.. బిర్యానీని కూడా నిషేధించాలని” ఓ పెద్ద స్టేట్మెంట్ నే ఇచ్చేశాడు. కమల్ లాంటి సెలబ్రిటీలే జల్లికట్టుకు అనుకూలంగా అంత భారీ ఎనౌన్స్ మెంట్ ఇచ్చిన తర్వాత ఇక సామాన్యల పరిస్థతి అర్ధం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో హీరోయిన్ త్రిష ఇప్పుడు జల్లికట్టు అభిమానుల ఆగ్రహానికి బలైపోయింది. ‘పెటా’ సంస్థ తరఫున త్రిష పలు జంతు సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జంతువుల్ని హింసించడం అన్యాయం, జల్లికట్టు ను నిషేధించాల్సిందే అని ఈ మధ్య ఓ ప్రకటన చేసింది త్రిష. దీంతో ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఎంతాలా అంటే ”త్రిష చనిపోయారు” అనే రాతల వరకూ వెళ్ళింది.
హీరోయిన్ త్రిష చనిపోయినట్లు శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయ్యింది. ఆ ఫొటోను చూసి త్రిష షాక్ అయిపోయింది. మహిళలు ఇలా గౌరవించడం తమిళ సంప్రదాయమా? ఇలాంటి పోస్టులు పెట్టేవారికి తమిళ సంప్రదాయం గురించి మాట్లాడే అర్హత వుందా ? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది త్రిష.
తమిళనాడులు ఇంతే మరి. నచ్చితే గుడికట్టి పూజలు చేస్తారు. తేడా వస్తే,, ఇదో ఇలా భీవత్సం సృష్టిస్తారు. మొత్తంమ్మీద ఈ చర్యతో తమిళ తంబీలు మరోసారి తమ ‘ఓవర్’ యాక్షన్ ను చాటుకున్నారు.