ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుణ్ గుప్తా అనేపెద్ద మనిషి సోమవారం కలిశారు. ఆయన త్రివేణి గ్లాస్ కంపెనీ యజమని అని.. ఏపీలో రూ. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారని ప్రచారం చేశారు. సాక్షి మీడియాలోనూ త్రివేణి గ్లాస్ అని విస్తృతంగా ప్రచారం చేశారు. దశాబ్దాలుగా ఆ సంస్థ వ్యాపారం చేస్తోందని వైసీపీ సోషల్ మీడియా ఉదరగొట్టింది. వాస్తవానికి సీఎం జగన్తో సమావేశమైన వరుణ్ గుప్తాకు.. త్రివేణి గ్లాస్ మిలిటెడ్కు సంబంధం లేదు. వరుణ్ గుప్తా కంపెనీ పేరుతో త్రివేణి రెవ్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్.
త్రివేణి రెవ్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 2021లోనే ప్రారంభించారు. అంటే ఏడాదిన్నర రెండేళ్లు మాత్రమే. పెయిడప్ క్యాపిటల్ కేవలం రూ. పదకొండు కోట్ల రూపాయలు. రండేళ్లుగా ఏంఉత్పత్తులు చేసింది.. ఎంత వ్యాపారం చేసిందన్న వివరాలు కంపెనీల వెబ్ సైట్లో కూడా లేవు. ఇలాంటి కంపెనీ ఏకంగా రూ. వెయ్యి కోట్ల పెట్టుబడిని ఏపీకి ప్రకటించేసింది. నేరుగాసీఎం జగన్ తో సమావేశం అయ్యారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీంతో అంతా ఈ త్రివేణి గ్లాస్ గురించి వెదికారు. కానీ తేలింది . అసలు త్రివేణి గ్లాస్ కాదని.. త్రివేణి రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్పష్టమయింది.
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఊరూపేరూ లేని కంపెనీలు వచ్చాయి. స్వయంగా పులివెందులలోనే ఎన్నో పరిశ్రమలు పెడతామని ఒప్పందాలు చేసుకున్నారు. ఇంటలిజెంట్ అని.. మరొకటని ఒప్పందాలు చేసుకున్నారు. అనంతపురంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ అన్నారు. ఏదీ రాలేదు. ఇప్పుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ఇలాంటి కంపెనీలతో వేల కోట్ల పెట్టుబడల ఒప్పందాలను చేసుకుంటారేమోనన్న సందేహాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.