పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో `అత్తారింటికి దారేది` వచ్చి సూపర్ హిట్ అయిన తరవాత… పవన్, త్రివిక్రమ్ లు వెంటనే మరో సినిమా చేయాలని ఫిక్సవ్వడం, `కోబలి` అనే టైటిల్ బయటకు రావడం తెలిసిన విషయాలే. ఈ స్క్రిప్టుపై కొంత మేర త్రివిక్రమ్ పనిచేశాడు కూడా. టీమ్ అంతా సెట్ అయ్యాక… ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తరవాత… `కోబలి` పక్కన పెట్టి, ఇద్దరూ `అజ్ఞాతవాసి` చేశారు. కానీ… `కోబలి`పై త్రివిక్రమ్ కి ప్రేమ తగ్గలేదు. దాన్ని ఎలాగైనా సరే.. పవన్ తో చేయాలని ఫిక్సయ్యాడని తెలుస్తోంది. ఈమధ్య `కోబలి` స్క్రిప్టుపై త్రివిక్రమ్ మళ్లీ దృష్టిసారించినట్టు సమాచారం. అయితే త్రివిక్రమ్ ఇప్పటికిప్పుడు పవన్‌తో చేసే ఛాన్సు లేదు. ఎందుకంటే…. తన చేతిలో మహేష్ బాబు సినిమా వుంది. పవన్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. త్రివిక్రమ్ టోకెన్ వచ్చేసరికి చాలా కాలం పడుతుంది. అయితే త్రివిక్రమ్ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. పవన్‌తో సినిమా ఓకే చేయించుకున్న దర్శకుడికెవరికైనా `కోబలి` స్క్రిప్టు ఇచ్చేద్దామనుకుంటున్నాడట. అలా కాని పక్షంలో.. రెండు మూడు నెలల గ్యాప్ దొరికితే, ఆ విరామంలో ఈ సినిమా చేసేద్దామనుకుంటున్నాడట. రెండు ఆప్షన్లలో ఏది కుదిరినా ఓకే. ఈ కథ పవన్ కి ఎలాగూ నచ్చింది కాబట్టి, అటు నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవొచ్చు. `కోబలి` స్క్రిప్టు ని సేల్ చేసుకోవడం పై త్రివిక్రమ్ దృష్టంతా. తాను తలచుకుంటే ఈ రోజుల్లో కానిది ఏముంది?