గుంటూరు కారం తరవాత త్రివిక్రమ్ సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. నిజానికైతే… అల్లు అర్జున్ తో ఓ సినిమా పట్టాలెక్కాలి. ఈ కాంబోకి సంబంధించి ఇది వరకే ఓ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. కానీ… సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా టైమ్ పట్టేట్టు ఉంది. ముందు బన్నీ పుష్ష 2 పూర్తి చేయాలి. ఆ తరవాత బన్నీతో సినిమా చేయడానికి అట్లీ, బోయపాటి రెడీగా ఉన్నారు. వారిద్దరినీ కాదని తనతో బన్నీ సినిమా చేస్తాడా, లేదంటే ఈ గ్యాప్‌లో మరో హీరోని చూసుకోవాలా? అనే సందిగ్థంలో ఉన్నాడు త్రివిక్రమ్. నిన్నటికి నిన్న బోయపాటి శ్రీను సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. హీరో పేరు చెప్పకపోయినా గీతా ఆర్ట్స్ బోయపాటితో చేసే సినిమా అల్లు అర్జున్ కోసమే అని… ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. బన్నీ మైండ్ లో ఏముందో.. త్రివిక్రమ్ గ్రహించగలడు. సో… దానికి తగ్గట్టుగా ప్లాన్ బి కూడా త్రివిక్రమ్ దగ్గర రెడీగా ఉంది.
నాని – వెంకటేష్ లకు సరిపడా ఓ మల్టీస్టారర్ కథ త్రివిక్రమ్ దగ్గర సిద్ధంగా ఉంది. నాని ఇప్పటికే తన అంగీకారం తెలిపినట్టు టాక్. వెంకీ కాస్త డౌట్ లో ఉన్నాడు. వెంకీ అటూ ఇటూ ఊగితే, ఆ ప్లేస్ లో మరో హీరోని తీసుకురావడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు రామ్ తోనూ త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామ్ తో సినిమా కంటే నానితో మల్టీస్టారరే త్రివిక్రమ్ ముందున్న బెటర్ ఆప్షన్. ఇక బన్నీ పిలుపు కోసం చూడకుండా ఈ కథపైనే ఫోకస్ చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.