త్రివిక్రమ్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి.. ఇవన్నీ మంచి హిట్ ఆల్బమ్స్. దేవి లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయడేమో అన్నంత రేంజ్ లో వీళ్ల అనుబంధం సాగింది. అయితే మధ్యలో వీరిద్దరికీ బ్రేక్ వచ్చేసింది. గత కొంత కాలంగా దేవి లేకుండానే సినిమాలు చేస్తూ వెళ్లాడు త్రివిక్రమ్. ఆ ప్రయాణంలో తమన్ ని.. మ్యూజిక్ డైరెక్టర్గా నిలబెట్టేశాడు. `అల వైకుంఠపురములో` ఆల్బమ్ తో తమన్ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే… తమన్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయడన్నంత రేంజ్ లోకి వెళ్లింది.
ఇప్పుడు మహేష్ తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. దీనికి సంగీత దర్శకుడిగా మణిశర్మ పేరు దాదాపుగా ఖాయం అనుకుంటున్నారు. కానీ.. అంతలోనే చిన్న మార్పు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఈసారి.. దేవిని మళ్లీ లైన్లోకి తీసుకొచ్చే ఛాన్సుందని సమాచారం అందుతోంది. మణిశర్మ ని పక్కన పెట్టే ఛాన్సుంటే మాత్రం.. కచ్చితంగా ఈ చిత్రానికి దేవినే సంగీత దర్శకుడు అయ్యే ఛాన్సుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడానికి దేవి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.