మహేష్ బాబు – త్రివిక్రమ్ హ్యాట్రిక్ సినిమా ఇటీవలే మొదలైంది. ఓ ఫైట్ తో ఈ సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆ ఫైట్ పూర్తయిపోయింది. దాంతో ఫస్ట్ షెడ్యూల్‌కి పుల్ స్టాప్ పెట్టారు.రెండో షెడ్యూల్ దసరా తరవాత మొదలవుతుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటుగా పూజా హెగ్డే కూడా పాల్గొంటుందని క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు నిర్మాత నాగవంశీ ట్విట్టర్ లో అప్ డేట్ ఇచ్చారు. ఈ ఫైట్‌కి అన్బు – రవి అనే జంట కొరియెగ్రాఫర్లు కంపోజ్ చేశారు. ఫైట్ బాగా వచ్చిందని, మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చిన అన్బు – రవిలకు థ్యాంక్స్ అంటూ నిర్మాత ట్వీట్ చేశారు.
అయితే… అన్సు – రవిల కొరియోగ్రఫీ మహేష్ కు నచ్చలేదని, దాంతో షూటింగ్ ఆపేశారని, ఈ వ్యవహారంపై అలిగిన ఫైట్ మాస్టర్లు వెనక్కి వెళ్లిపోయారని, ఆ ప్లేస్ లో కొత్త ఫైట్ మాస్టర్లు వచ్చారని ఓ గాసిప్ వెబ్ సైట్ వార్తలు వండి వార్చింది. ఈలోగానే… ఆ ఫైట్ షూటింగ్ మొత్తం పూర్తయిపోయిందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.