తమ సినిమాలు లైమ్ లైట్ లో ఉండాలని.. ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ `తమ సినిమాలు మాత్రమే` అనుకోవడంలోనే సమస్య వుంది. పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇలా ఆలోచించడం, తమ సినిమాల ప్రమోషన్ల కోసంపలుకుబడిని, పరపతిని ఉపయోగించడం – ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పంథా కూడా అలానేఉంది.
సెప్టెంబరు 2 పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అప్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. భీమ్లానాయక్ నుంచి ఓ పాట వస్తుందని ముందే సమాచారం అందేసింది. పవన్ – హరీష్ శంకర్ల కాంబినేషన్ లో ఓ సినిమారాబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ పవన్ పుట్టిన రోజు సందర్భంగా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీటితో పాటుగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఎ.యం.రత్నం సినిమా `హరి హర వీరమల్లు` నుంచి కూడా ఓ ఓ చిన్నపాటిటీజర్ వస్తుందని అందరి ఆశ. ఒకేసారి మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్లూ వచ్చేస్తే ఎలా? అన్నదే `భీమ్లానాయక్` టీమ్ ని ఇబ్బంది పెడుతోంది. పవన్ అభిమానుల చూపంతా తమపైనే ఉండాలంటే…ఈ రోజున మిగిలినఅప్డేట్లేం రాకూడదు. అందుకే త్రివిక్రమ్ రంగంలోకి దిగారని సమాచారం. `పవన్ పుట్టిన రోజున మీ సినిమాలకుసంబంధించిన అప్ డేట్లని ఆపండి…` అంటూ త్రివిక్రమ్ ఒత్తిడి తో పవన్ ఆఫీస్ నుంచి హరీష్ శంకర్ , క్రిష్ సినిమాలసంబంధించిన వారికి ఫోన్లు వెళ్లాయట. దాని ఉద్దేశ్యం… ఆ రోజు ట్రెండింగ్ లో `భీమ్లా నాయక్` ఉండాలన్నదే. దాంతో ఆరెండు చిత్రాల నిర్మాతలు షాక్ తిన్నార్ట.
పవన్ పుట్టిన రోజున… అప్ డేట్ ఇచ్చి.. ఫ్యాన్స్ ని సంతృప్తి పరచాలని ఎవరికి మాత్రం ఉండదు? హరి హర వీరమల్లుఎప్పటి నుంచో సెట్స్‌పై ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క టీజర్ కూడా బయటకు రాలేదు. పవన్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ వదిలితే.. ఆసినిమాకి బజ్ ఏర్పడుతుంది. హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఏమిటా? అని చాలారోజుల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇదంటూ ఒకట్రెండు పేర్లు బయట చక్కర్లుకొడుతున్నాయి. ` ఆ వార్తలేం నమ్మొద్దు. మంచి ముహూర్తం చూసుకుని మేమే టైటిల్ చెబుతాం` అని మైత్రీ ఎప్పుడోచెప్పింది. పవన్ పుట్టిన రోజు కంటే మంచి ముహూర్తం వాళ్లకు ఏముంటుంది?
అయితే ఇప్పుడు త్రివిక్రమ్ క్యాంప్ చర్యతో ఆ ఇతర ఇద్దరు నిర్మాతలూ తల పట్టుకుంటున్నారు.తమ సినిమాల అప్డేట్లని ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు టాక్. `భీమ్లా నాయక్` టీజర్‌తో ఆ సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇది ఇప్పటికీఉంది. మిగిలిన సినిమాల అప్ డేట్లు బయటకు వస్తే… తామెక్కడ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అవ్వమో.. అన్నది భీమ్లా నాయక్భయం. అన్నీ పవన్ సినిమాలే. దేనికొచ్చినా.. తమ హీరోకి వచ్చినట్టే అనుకోవొచ్చు కదా..? మరీ ఇంత స్వార్థమా??!