అఖిల్ ని త్రివిక్రమ్ దర్శకత్వంలోనే లాంచ్ చేద్దాం అనుకున్నారు నాగార్జున. చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ త్రివిక్రమ్ బాగా బిజీ అయిపోయారు. కొంత కాలం ఆగమన్నారు. అయితే వెయిటింగ్ నచ్చక ఓ సూపర్ మ్యాన్ కధతో రంగంలో దిగిపోయాడు అఖిల్. రిజల్ట్ అందరికీ తెలుసు. ఇప్పుడు రెండో సినిమా కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు, సరైనా కధ కుదిరినప్పుడే చేద్దాం అని నిర్ణయానికి వచ్చేశాడు అఖిల్. విక్రమ్ కుమార్ తో ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో వుంది.
అయితే రెండో సినిమాకి కూడా త్రివిక్రమ్ ను సంప్రదించారు. నాగార్జున కెరీర్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో మన్మథుడు ఒకటి. రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా వచ్చినీ సినిమా ఘన విజయం సాధించింది. ఈ కధ రాసింది త్రివిక్రమ్. అఖిల్ తో ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో చేశారు నాగార్జున. అయితే త్రివిక్రమ్ మాత్రం ఎందుకో సుముఖత చూపలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక న్యూస్ హాల్ చల్ చేస్తోంది. అదేంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది.ఇందులో వాస్తవం ఏమిటో కానీ కనుచూపు మేరల్లో ఈ సినిమా సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
త్రివిక్రమ్ ఇప్పుడు యమా బిజీ. ముందు పవన్ కళ్యాణ్ సినిమా చేయాలి. తర్వాత ఎన్టీఆర్ సినిమా లైన్ లో వుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తో ఓ మూవీ ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. మహేష్ బాబే ఇటివలే ఈ సినిమా గురించి హింట్ ఇచ్చారు. రామ్ చరణ్ ఎప్పటినుండో లైన్ లో వున్నాడు. కుదిరితే బన్నీ కూడా ఓ సినిమా చేసేయాలి అనే ప్లాన్ చేస్తున్నాడు. ఇంత బిజీ షెడ్యుల్ మధ్య చైతు మూవీ అంటే ఎప్పటికి కుదిరేను.