‘గుంటూరు కారం’ తరవాత త్రివిక్రమ్ సినిమా ఎవరితో? అనేది డిస్కర్షన్ పాయింటే. నిజానికి ఆయన… అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలి. కానీ బన్నీ – అట్లీ కాంబో ఒకటి సెట్ అయ్యింది. ‘పుష్ష 2’ తరవాత అదే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. త్రివిక్రమ్ సినిమా ఫైనల్ అయ్యేందుకు ఇంకాస్త టైమ్ ఉంది. ఈలోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. అందుకోసం త్రివిక్రమ్ కూడా ప్రిపేర్గానే ఉన్నాడు. త్రివిక్రమ్ దగ్గర ఓ కథ రెడీగా ఉంది. అది నానికి బాగా సెట్ అవుతుంది. వెంకటేష్ ని కూడా పెట్టి మల్టీస్టారర్‌గా తీసే ఆలోచన ఉంది. వీరిద్దరి డేట్లూ… దొరకడం కష్టం అనుకొంటే మరో ఆప్షన్ కోసం కూడా అన్వేషిస్తురన్నారు.
రామ్ పై కూడా ఆయన దృష్టి ఉందని తెలుస్తోంది. రామ్ ‘ఇస్మార్ట్ శంకర్ 2’తో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తరవాత రామ్ ఫ్రీనే. అందుకే రామ్ తో ప్రొసీస్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడు. త్రివిక్రమ్ తో సినిమా అంటే పెద్ద హీరోలు ఎవర్రెడీ. కాకపోతే వాళ్లలో ఒక్కరు కూడా ఇప్పుడు ఖాళీగా లేరు. అందుకే అందుబాటులో ఉన్న హీరోతోనే ప్రాజెక్ట్ ఫిక్స్ చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన.