తనయుడి సినిమా అంటే అల్లు అరవింద్ జాగ్రత్తపడిపోతారు. ఫైనల్ అవుట్ పుట్ బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా ఆయన కొన్ని కరక్షన్స్ చెప్పడం, దాన్ని దర్శకుడు, నిర్మాతలు తుచ తప్పకుండా పాటించడం పరిపాటి. అయితే… `అల వైకుంఠపురములో` సినిమా విషయంలో మాత్రం అరవింద్ మాట చెల్లుబాటు కాలేదని తెలుస్తోంది. ఫైనల్ కాపీ వచ్చాక అరవింద్ ఈ సినిమా రెండు మూడు సార్లు చూసేశారు. ఆయనకంటూ కొన్ని మార్పులు సూచించారు కూడా. నిడివి విషయంలో అరవింద్ పట్టుగా ఉన్నారని, ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాల్ని ట్రిమ్ చేయాలని ఆయన సూచించారని, అయితే త్రివిక్రమ్ మాత్రం అరవింద్ మాట వినలేదని. తన మాటలతో ఆయన్ని కన్వెన్స్ చేసి – ఒప్పించాడని తెలుస్తోంది.
అంతేకాదు.. ‘సామజవరగమన’ పాటని విదేశాల్లో తెరకెక్కించడం కూడా అరవింద్‌కి నచ్చలేదట. ఆ పాటని ఇండియాలోనే తీయాలని సూచించారట. కానీ… పాట సూపర్ హిట్టయ్యిందని, దాన్ని సాదా సీదాగా తీస్తే కుదరదని పట్టుబట్టి మరీ త్రివిక్రమ్ ఆ పాటని విదేశాల్లో తెరకెక్కించాడట. అయితే… త్రివిక్రమ్ నిర్ణయాల్ని ముందు విబేధించినా, ఆ తరవాత అల్లు అరవింద్ సర్దుకుపోయారని టాక్. అల్లు అరవింద్ ఓ దర్శకుడి మాటు తలొంచడం, పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం బహుశా ఆయన కెరీర్లోనే ఇదే మొదటిసారేమో…?