అ.ఆ సినిమా, అది అందుకొన్న విజయం, సాధించి వసూళ్లు దర్శకుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. సింపుల్ కథని, అందంగా తెరకెక్కిస్తే.. తప్పకుండా పెద్ద సినిమా రేంజులో ఆడేస్తుందన్న నమ్మకం కలిగింది. మిగిలిన దర్శకులంతా త్రివిక్రమ్‌లా ఆలోచించడం మొదలెట్టారు. అ.ఆ విజయం త్రివిక్రమ్‌లో కూడా కొండంత కాన్పిడెన్స్‌ని నింపింది. త్రివిక్రమ్ బ్రాండ్ కున్న వాల్యూ ఏంటో.. తనకే తెలిసొచ్చింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మరో చిన్న సినిమాని పట్టాలెక్కించడానికి ఈ మాటల మాంత్రికుడు ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అ. ఆ తరవాత త్రివిక్రమ్ సినిమా ఏమిటి? ఎవరితో అన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. సూర్యతో ఓ సినిమా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా అనుకోని కారణాలతో.. వెనక్కి వెళ్లింది. దాంతో పవన్ కల్యాణ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు త్రివిక్రమ్. పవన్ – డాలీ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. అయితే డాలీ సినిమా పూర్తవ్వడానికి కనీసం మరో మూడు నెలల సమయం పడుతుంది. అంత వరకూ ఖాళీగా ఉండడం త్రివిక్రమ్‌కి నచ్చడం లేదు. ఈలోగా ఓ చిన్న సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో పూర్తి చేయగలిగే కథలేమున్నాయి? అందుకు తగిన ఆర్టిస్టులెవరు? అనే విషయంలో త్రివిక్రమ్ తర్జన భర్జనలు పడుతున్నట్టు టాక్. కథ దొరికేస్తే ఆర్టిస్టుల్ని ఫైనలైజ్ చేయడం ఈజీనే. అ.ఆలాంటి మరో ఆలోచన తడితే.. త్రివిక్రమ్ నుంచి మరో చిన్న సినిమా త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.