అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సూపర్ డూపర్ కాంబినేషన్. బన్నీకి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో అలాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్, మహేష్ తర్వాత అంతలా బన్నీతోనే కనెక్ట్ అయ్యారు త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా చేయాలంటే మొదటి ఆప్షన్ బన్నీనే. ప్రస్తుతం కూడా ఆయన బన్నీ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో వున్నారు. తాజాగా అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చారు బన్నీ. ఇందులో త్రివిక్రమ్ స్పెషల్ వీడియో బైట్ వుంది.
”జులాయి’ సిట్టింగ్లో మాట్లాడుకున్నప్పుడే మా జర్నీ చాలా కాలం పాటు కొనసాగుతుందని అనిపించింది. బన్నీ సినిమా సినిమాకి స్టార్ డమ్ లోనే కాదు వ్యక్తి కూడా పెరుగుతున్నారు. పుష్ప చూసిన తర్వాత దిష్టి తగిలేంత గొప్పోడు అయిపోయాడు అనిపించింది. భారతీయ సినిమాలో విజయాలకి ఒక డైరెక్టరీ ఉంటే అందులో ముందు వరుసలో బన్నీ పేరు ఉంటుంది. ప్రస్తుతం నాకు తెలిసి బన్నీ యాక్ట్ చేయట్లేదు తపస్సు చేస్తున్నాడు. గత మూడు నాలుగేళ్లుగా ఆ తపస్సుని ఆయన మొదలుపెట్టారు. ఆయన కంటే వయసులో పెద్దవాడిని కాబట్టి ఆయన బాగుండాలని ఆశీర్వదిస్తున్నాను. తెలుగు సినిమా రంగం నుంచి మమ్మల్ని అందరినీ అంతర్జాతీయ వేదిక మీదకి తీసుకెళ్లే సత్తా ఉన్న హీరోగా అతన్ని అభినందిస్తున్నాను’ అంటూ తనదైన శైలి బన్నీతో వున్న అనుబంధాన్ని పంచుకున్నారు త్రివిక్రమ్.
త్రివిక్రమ్ మాటలకు బన్నీ రియాక్ట్ అవుతూ.. నాకు మూడు బిగ్గెస్ట్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఆయన. తన గురించి నేనేం మాట్లాడలేను’… ఇంతలోనే ఆ మాటని అందుకొని ”నాకు బోయపాటి ఎలానో.. నీకు నీకు త్రివిక్రమ్ అలా” అని బాలయ్య చెప్పడం క్లాప్స్ మూమెంట్.