త్రివిక్రమ్ అసలే మాటల మాంత్రికుడు. అందులోనూ తనకిష్టమైన పవన్ గురించి మాట్టాడమంటే ఇక ఊరుకొంటాడా??? ఇష్టంగా ఓ కవిత్వం అల్లాడు. అప్పటికప్పుడుపవన్ని ఆకాశం చేశాడు.. ఉప్పెనగా మార్చాడు. సునామీలా.. తీర్చిదిద్దాడు. వజ్రాయుధం అన్నాడు. సైన్యం తనే బాణం కూడా తనే అని చెప్పాడు. వాట్ నాట్… త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఒక్కో పలుకూ… పవన్ అభిమానుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇంతకీ అఆ ఆడియో ఫంక్షన్లో త్రివిక్రమ్ పవన్ గురించి ఏమన్నాడంటే..
ఆకాశం ఒకరికి తలొంచదు..
శిఖరం ఒకరికి సలాం అని తలొంచడం ఎరగదు
కెరటం అలసిపోయి ఒకరి కోసం ఆగదు
నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన
నేను దాచుకొన్న నా సైన్యం
నేను శత్రువుమీద చేసే యుద్దం
నేను ఎక్కుపెట్టిన బాణం
నా పిడికిలిలో ఉన్న వజ్రాయుధం
నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు
ఎంతోమంది గుండెల్ని తడపడానికి వచ్చే ఓ చిన్న వర్షపు చినుకు
ఓ స్నేహపు రుతుపవనం.. అదే పవన్ కల్యాణ్… వింటారా?? వెనకాలే వస్తారా?? తోడుగా ఉందాం వస్తారా???