త్రివిక్రమ్ సినిమా కోసం, తర్వాత చేయబోయే రాజమౌళి సినిమా కోసం ఎన్టీఆర్ జిమ్‌లో విపరీతంగా వర్కవుట్స్ చేస్తున్నాడు. ‘జై లవ కుశ’తో కంపేర్ చేస్తే యంగ్ టైగర్ లుక్ మారింది. వెయిట్ తగ్గి స్టయిల్ పెంచి కొత్త లుక్‌లో వచ్చాడు. త్రివిక్రమ్ ఎప్పుడు సెట్స్‌కి రమ్మంటే అప్పుడు రావడానికి ఎన్టీఆర్ రెడీ. ఐదు నెలల నుంచి సినిమా షూటింగులేవీ చేయడం లేదు. త్రివిక్రమ్ కోసమే వెయిటింగ్. నిజం చెప్పాలంటే… మార్చిలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఎన్టీఆర్ టీమ్ మార్చిలో షూటింగ్ అంటూ హడావుడి చేశారు. తాజాగా నిర్మాత ఎస్. రాధాకృష్ణ నుంచి ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రెస్‌నోట్ వచ్చింది. ఎందుకు షూటింగ్ లేట్ అవుతోంది? ఎన్టీఆర్ ఫ్రీగా వున్నాడు కదా! త్రివిక్రమ్ లేట్ చేస్తున్నాడా? అనే డౌట్స్ వచ్చాయి. మేటర్ ఏంటంటే… సిన్మా టీమ్‌లో మార్పులు జరిగాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్థానంలో తమన్ వచ్చాడు. నెక్స్ట్ హీరోయిన్ పూజా హెగ్డేను కూడా లేట్‌గా ఫైనలైజ్ చేశారు. ముందు నుంచి డిస్కషన్స్ జరుగుతున్నా అగ్రిమెంట్ కుదిరేసరికి కొంచెం టైమ్ పట్టింది. ఆర్టిస్టుల డేట్స్, మిగతా పనులు వల్ల షూటింగ్ ఆలస్యమవుతోందని సమాచారమ్. ఒక్కసారి మొదలైతే బ్రేక్స్ లేకుండా త్వరగా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నార్ట. త్రివిక్రమ్ స్క్రిప్ట్ లాక్ చేశాడని చెబుతున్నారు.