స్వతహాగా త్రివిక్రమ్ మంచి రచయిత. ఆ తరవాతే దర్శకుడయ్యాడు. తన కథలతోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ నవల ని ఎంచుకున్నాడు. రచయిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. కథల కోసం ఎప్పుడూ వెదుక్కోలేదు. అయితే.. తొలిసారి త్రివిక్రమ్ కథల వేటలో ఉన్నాడని తెలుస్తోంది. తన సర్కిల్ లో బాగా తెలిసిన రచయితల్ని పిలిపించి కథలు వింటున్నాడట. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. హారిక హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ ల సినిమాల కోసం. ఈ సంస్థలతో త్రివిక్రమ్ కి మంచి అనుబంధం ఉంది. అందుకే.. ఆయా సంస్థల కోసమే త్రివిక్రమ్ కథల్ని వింటున్నాడనుకోవొచ్చు.
దర్శకుడిగా త్రివిక్రమ్ కొత్త కథల్ని అన్వేషిస్తున్నాడు. ఎప్పుడూ ఒకే జోనర్లో ఉండడం త్రివిక్రమ్ కి ఇష్టం లేదు. తన జోనర్ దాటి, బయటకు వచ్చి, కొత్త కథలు ఎంచుకోవాలనుకుంటున్నాడు. అందుకే.. మార్పు కోసం బయటి కథల్ని వింటుడొచ్చు. పైగా.. బడా దర్శకులు ఈమధ్య నిర్మాతలుగా రాణిస్తున్నారు. తమకు నచ్చిన కథలతో, బయటి దర్శకులతో సినిమాలు తీసి, కమర్షియల్ గా సక్సెస్లు కొడుతున్నారు. మరి త్రివిక్రమ్ కథల అన్వేషణల వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటో??