పవన్ కల్యాణ్ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘పింక్’ రీమేక్ కోసం ఆయన మేకప్ వేసుకోబోతున్నారు. అసలు ఈ ప్రాజెక్టు పవన్ కల్యాణ్ చేతుల్లోకి వెళ్లడం వెనుక ప్రధాన కారణం త్రివిక్రమ్. దిల్‌రాజు ఈ సినిమా ఎవరితో చేద్దామనే ఆలోచనలో ఉండగా.. ‘పవన్‌తో చేస్తే బాగుంటుంది’ అని త్రివిక్రమ్ స్వయంగా సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు… ‘పింక్’ డీవీడీ తీసుకెళ్లి, పవన్‌కి దగ్గరుండి చూపించి ‘ఈ సినిమా మీరు చేస్తేనే కరెక్ట్’ అంటూ పవన్ కి సలహా ఇచ్చింది కూడా త్రివిక్రమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ సమయంలోనే ఈ సినిమాకి సంభాషణలు మీరు రాస్తే బాగుంటుందని పవన్ సూచించాడట. అయితే త్రివిక్రమ్ మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాకి డైలాగులు రాయడం కుదరదని చెప్పేశాడట. అంతేకాదు.. ‘ఈ సినిమాలో డైలాగుల కంటే ఎమోషన్‌కే ప్రాధాన్యం ఎక్కువ ఉంది. డైలాగులు ఎవరు రాసినా పెద్ద తేడా ఏమీ ఉండదు’ అని కవర్ చేశాడట. అలా.. ఈ సినిమాకి సంభాషణలు రాసే బాధ్యత నుంచి త్రివిక్రమ్ తప్పించుకోగలిగాడు. అయితే ఈ ప్రాజెక్టు ఓకే అవ్వడం వెనుక మాత్రం త్రివిక్రమ్ కృషి ఉంది.