త్రివిక్రమ్ కి అత్యంత ఇష్టమైన కో – డెరెక్టర్ సత్యం. ఆమధ్య కోవిడ్ సమయంలో కన్నుమూశారు. ఆ టైమ్లో ఆ కుటుంబాన్ని త్రివిక్రమ్ తన వంతు సాయంగా ఆదుకున్నారు కూడా. ఇప్పుడు మరో బాధ్యతని కూడా నెత్తిమీద వేసుకున్నారు. సత్యం తనయుడు వశిష్టని హీరోగా చేసే బాధ్యత తాను తీసుకొన్నారు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు అనుకుంటే ఆగేదేముంది? అందుకే ఆ పనులూ మొదలైపోయాయి.
`కప్పెల` చిత్రాన్ని తెలుగులో హారిక హాసిని సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ దాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హీరో పాత్రధారి కోసం అన్వేషణ జరుగుతోంది. ముందు విశ్వక్సేన్ పేరు పరిశీలించారు. ఆ తరవాత.. సిద్దు జొన్నలగడ్డని ఎంచుకున్నారు. అయితే `డీజే టిల్లు`తో తన ఇమేజ్ మారడంతో, ఈ సినిమా వదులుకోవాల్సివచ్చింది. ఇప్పుడు `కప్పెల` చిత్రానికి హీరో కావాలి. అందుకే.. వశిష్టని ఈ సినిమాకి హీరో చేసేశాడు త్రివిక్రమ్. అలా.. ఈ సినిమాకి హీరో దొరికేశాడు. తన కో – డైరెక్టర్ రుణం కూడా తీర్చేసుకొన్నాడు. వశిష్టకు ఇదే తొలి సినిమా కాదు. ఇది వరకు ఓ సినిమా చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఈసారి త్రివిక్రమ్ చేతిలో పడ్డాడు కాబట్టి… నిలబడే ఛాన్సుంది. ఇప్పటికే.. కప్పెల చిత్రానికి సంబంధించి చాలా వరకూ షూటింగ్ పూర్తయిపోయింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బయటకు రానుంది.