మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ సినిమాలన్నీ దాదాపు కుటుంబ కథా చిత్రాలు, లేదంటే ఫక్తు ఎంటర్టైన్మెంట్ కథలే. అతడులో యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా… ఫ్యామిలి ఎమోషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. జల్సాలో లవ్ తో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేశాడు. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి రెండూ ఫ్యామిలీ సబ్జెక్టులే. ఇప్పుడు అ.ఆ కూడా అదే జోనర్ సినిమా. తొలిసారి.. తనది కాని జోనర్‌ని టచ్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. అదీ.. సూర్య సినిమాతో.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. అఆ తరవాత దాదాపుగా ఈ సినిమానే పట్టాలెక్కే ఛాన్సుంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ అప్పుడే కథ కూడా లాక్ చేశాడు. రెగ్యులర్ గా తాను చేసే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ని పక్కన పెట్టి, సూర్య కోసం సూర్య జోనర్‌లోనే వెళ్లబోతున్నాడు. వెరైటీ కథల్ని ఇష్టపడే సూర్యకు అలాంటి ఓ వెరైటీ కథే చెప్పి ఒప్పించాడట. ఇదో సైంటిఫిక్ సోపియో ఫాంటసీ సినిమా అని తెలుస్తోంది. ఈ జోనర్లో ఓ కథ రాసుకోవడం త్రివిక్రమ్‌కి ఇదే తొలిసారి. సూర్య కూడా ఈ జోనర్‌ని టచ్ చేయలేదు. సైన్స్, భక్తి, దేవుడు.. ఇలాంటగి అంశాలన్నీ మిక్స్ చేసిన కథ ఇదని తెలుస్తోంది. బడ్జెట్ కూడా భారీగానే కేటాయించబోతున్నారు. దాదాపు రూ.80 కోట్లతో ఈ సినిమా తెరకెక్కించనున్నారట. కొత్త హీరో, కొత్త జోనర్… భారీ బడ్జెట్ – త్రివిక్రమ్ స్కెచ్ భారీ స్థాయిలోనే ఉన్నట్టుంది.