రాజమౌళి.. కలల చిత్రం `మహా భారతమ్`. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని చాలాసార్లు చెప్పాడు. అయితే అంతకు ముందు తాను నేర్చుకోవాల్సిన, తనని తాను తీర్చిదిద్దుకోవాల్సిన అంశాలు, విషయాలు చాలా ఉన్నాయన్నది తన అభిప్రాయం. అందుకే… `మహాభారతం` ఆలస్యం అవుతుందని చెప్పాడు.
అయితే అంతకంటే ముందు.. త్రివిక్రమ్ మహాభారతాన్ని చూడొచ్చు. రామాయణ, మహాభారత ఇతిహాసాల్ని అవపోసాన పట్టేసిన రచయిత, దర్శకుడు త్రివిక్రమ్. వాటిలో ఏ చాప్టర్ గురించి అడిగినా… త్రివిక్రమ్ చెప్పేయగలడు. తన సినిమాలోని సంభాషణల్లో, వాటిని అసువుగా చొప్పించగలడు. ఇప్పుడు వాటినే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడని ఇన్సైడ్ వర్గాల టాక్. మహాభారతాన్ని పూర్తిగా సోషలైజ్ చేసి సినిమా తీసే ఆలోచన త్రివిక్రమ్ కి ఉందట. అంటే యుద్ధాలు, భారీ భారీ సెట్లు ఉండవంతే. పాత్రలు మాత్రం కనిపిస్తాయి. పైగా అది మహాభారతమ్ అనిచెప్పడు. చూసి తెలుసుకోవాలి. అలానే రామాయణ గాథనీ తెరకెక్కించాలని వుందట. పూర్తిగా కాకపోయినా.. ప్రధాన పర్వాల్ని తీసుకుని – దాన్ని పూర్తిగా సోషలైజ్ చేసి తీయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అందులోనూ స్టార్ హీరోలే కనిపిస్తారు. మరి ఈ రెండు ప్రాజెక్టులూ ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూడాలి. `కోబలి` అనే స్క్రిప్టు కూడా త్రివిక్రమ్ దగ్గర రెడీగా ఉంది. దాన్ని కూడా తెరపై చూసుకోవాలన్నది తన ఆశ.