టాలీవుడ్ లోని టాప్ కథానాయికల్లో రష్మిక పేరు కూడా ఉంటుంది. ఒక్కో సినిమాకి రూ.2 నుంచి 3 కోట్ల రూపాయల పారితోషికం అందుకొంటోంది. తమిళం, హిందీ.. అంటూ.. అక్కడకి కూడా వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది. రష్మికకు కాల్షీట్లు అస్సలు ఖాళీ ఉండవు. మహా బిజీ. కొత్తగా వస్తున్న కథానాయికల నుంచి పోటీ తట్టుకోవడం మినహా.. ఇప్పుడు తనని తాను కొత్తగా నిరూపించుకొనేదేం లేదు. అయితే.. ఈమధ్య రష్మిక డ్రస్సింగ్ సెన్స్… చర్చనీయాంశం అవుతోంది. సినిమా వేడుకల్లో, అవార్డు ఫంక్షన్లలో.. రష్మిక వేసుకొచ్చిన దుస్తులు చూస్తే.. ‘రష్మిక ఏంటి రాను రాను ఇలా తయారవుతోంది’ అనే అనుమానం వేయక మానదు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌కి.. బ్లాక్ అవుట్ ఫిట్ లో ప్రత్యక్ష్యమైంది రష్మిక. ఆ డ్రస్స్ రష్మికకు సూటవ్వలేదు సరికదా..కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. ఎద అందాల్ని, తొడల్ని ఎక్స్పోజ్ చేస్తూ.. అంత పొట్టి డ్రస్సులో రావడం.. ఆమె అభిమానులకు సైతం నచ్చలేదు. ఇప్పుడనే కాదు… ఇది వరకు కూడా రష్మిక ఇలానే వెరైటీ డ్రస్సుల పేరుతో హద్దులు దాటి అందాల ప్రదర్శన చేసింది. కొత్త కథానాయికలు అందరి దృష్టినీ తమ వైపుకు తిప్పుకోవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. కానీ రష్మికకకు అంత అవసరం ఏమొచ్చింది?
రష్మిక డ్రస్సింగ్ సెన్స్ బాగోలేదన్నది వాస్తవం. కాకపోతే… ఈ విషయంలో రష్మిక ఉద్దేశ్యాలు వేరు కావొచ్చు. ఇప్పటి వరకూ సినిమాల్లో తన గ్లామర్‌ని సరిగా వాడుకోలేదని, ఈ రూపంలో అయినా కనిపిస్తే.. దర్శకులకు తనలోని కొత్త యాంగిల్ చూపించే అవకాశం ఉంటుందని రష్మిక భావించి ఉండొచ్చు. రష్మికని వెండి తెరపై ఎప్పుడూ ఇలాంటి దుస్తుల్లో చూళ్లేదు. కాబట్టి… తనని తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అవార్డు ఫంక్షన్లని ఓ వేదిక చేసుకొంటోంది రష్మిక. కొంతమంది కథానాయికలు సంప్రదాయమైన దుస్తుల్లోనే బాగుంటారు. మరీ ముఖ్యంగా ‘గీత గోవిందం’ లాంటి సినిమాల్లో పద్ధతైన పాత్రల్లో రష్మికని చూసిన కళ్లకు ఆమె ఎక్స్పోజ్ చేస్తే నచ్చదు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో నాటుకుపోయిన బలమైన సెంటిమెంట్ ని పట్టించుకోకపోతే.. ఇలానే రష్మిక విమర్శల పాలవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ గమనిస్తే బెటర్.