ఓ సినిమా విడుదలకు ముందు.. పాజిటీవ్ బజ్జో, నెగిటీవ్ బజ్జో ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే.. అది కొంత ఇది కొంత. ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేదాన్ని బట్టి ఆ సినిమా చూడాలా, వద్దా? అనే నిర్ణయానికి వస్తారు ఆడియన్స్. అయితే అదేం విచిత్రమో… `సన్నాఫ్ ఇండియా`కి ట్రోల్స్ తప్ప ఇంకేం కనిపించడం లేదు. రేపు ఈ సినిమా విడుదల అవుతోంది. నాలుగు రోజుల క్రితమే బుక్ మై షోలో అడ్వాన్స్బుకింగులు మొదలయ్యాయి. అప్పట్నుంచి చూడాలి.. ట్రోల్స్ ఓ రేంజ్లో చేస్తున్నారు. `బుక్ మై షో యాప్లో ఒక్క టిక్కెట్ కూడా… బుక్ కాని రికార్డ్… ఈ సినిమాదే` అని ఎవరోట్వీట్ చేస్తే, `అది శుద్ధ అబద్ధం.. రెండు టికెట్లు బుక్ అయ్యాయి` అంటూ ఇంకొకరు ఆన్సర్ ఇచ్చారు. `ఓయో హోటెల్స్కంటే ప్రేమికులకు ఈ సినిమా ఆడుతున్న థియేటర్లే సేఫ్` అంటూ మరో ట్రోల్. ఇలా ఒకటా, రెండా…? పదులు, వందల సంఖ్యలో ట్రోల్స్ తెగ తిరిగేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డే పోస్టర్ల కంటే మీమ్స్, ట్రోల్స్.. పోస్టింగులే ఎక్కువ ఉన్నాయంటే.. ఈ సినిమాని ఏ రేంజ్లో ఆడుకుంటున్నారోఅర్థం చేసుకోవొచ్చు. ఓ సినిమా… అందులోనూ 500 సినిమాలు చేసి, 50 సినిమాలు తీసిన… ఓ నటుడు నటించిన సినిమాని, విడుదలకు ముందే ఇలా ట్రోల్ చేస్తున్నారంటే ఆశ్చర్యకరమైన విషయమే. ఇంత నెగిటివిటీ ఇది వరకు లేదు. న భూతో..న భవిష్యత్త్ అంటారే.. ఆ టైపులో జరుగుతోంది ట్రోలింగ్. ఇక సినిమా విడుదల అయ్యాక ఏ రేంజ్లో రెచ్చిపోతారో జనాలు.
`ఇద్దరు హీరోలు నామీద పని గట్టుకుని… ఇలా ట్రోల్స్ చేయిస్తున్నారు` అన్నది మోహన్ బాబు అభియోగం. ఇదంతాప్రత్యర్థులు, యాంటీ ఫ్యాన్స్ పని అవునా, కాదా… అనేది పక్కన పెడితే, ట్రోలర్స్కీ, మీమర్స్ మంచు ఫ్యామిలీ కి రుణపడిపోయి ఉంటుందన్నది నిజం.