ఉద్యమ కాలంలో తెలంగాణలో ఆత్మహత్యలపై చాలా రాజకీయ చర్చ నడిచేది. తర్వాత వారి కుటుంబాలను ఆదుకకపోోవడంపైన కూడా అనేక విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ప్రభుత్వం ఏవో కొన్ని సహాయాలు ప్రకటించింది. రాష్ట్రావతరణ తర్వాత కూడా రైతాంగం ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో వున్నా ప్రభుత్వం నుంచి తగు స్పందన లేదనే విమర్శలు వచ్చాయి.పైగాఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను మంత్రులు వెళ్లి చూడలేదని, పోచారం శ్రీనివాసరెడ్డి వంటివారు పొరబాటుగా మాట్లాడారని శాసనసభలోనే చర్చ జరిగింది. నాలుగు విడతల రుణమాపీ, వచ్చేఏడాది నుంచి పెట్టుబడిసాయం వంటివి తప్పిస్తే కెసిఆర్ ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభ నివారణకు తక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రత్యేకించి కెటిఆర్‌ను కలుసుకున్న ఒక కార్మికుడి ఆత్మహత్య అందరినీ కలచివేసింది. ఆయన వారిని పరామర్శించడమే గాక అప్పటినుంచి చేనేతపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. మార్పు మాత్రం ఇంకా రావలసే వుంది. ఇవన్నీ ఒక తరహా అయితే ఇప్పుడు టిఆర్ఎస్ కార్యకర్త మహిపాల్ రెడ్డి భార్య ఇద్దరు పిల్లలను వదలిపెట్టి ఆత్మహత్య చేసుకోవడం పెద్ద విషాదమే. ఈ సందర్భంగా రాసిన నోట్లో ఆయన పార్టీలో బయిట నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత నిస్తున్నారని తన వంటి వారికి ప్రోత్సాహం లేదని కెటిఆర్‌ను ఉద్దేశించి రాశారట మంత్రి మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సహాయం చేస్తామని ప్రకటించారు గాని అసలు ఇలాటి విపరీత పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో టిఆర్ఎస్ నాయకత్వం సమీక్షించుకోవద్దా?