టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల వ్యూహాల్లో వేగం పెంచారు. పెండింగ్‌లో ఉన్న 12 స్థానాలకు పోటీచేసే నేతల పేర్లను ఖరారు చేశారు. వారికి ఈ రోజే బీఫామ్స్ అందించబోతున్నారు. ఆఖరి నిమిషంలో మార్పులు ఉంటే తప్ప పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందరు అభ్యర్థులకు కలిపి ఒకేసారి ప్రచారంపై మార్గనిర్దేశనం చేయనున్నారు. ఖైరతాబాద్‌కు దానం నాగేందర్, గోషామహల్‌కు ప్రేమ్‌సింగ్ రాథోడ్, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్, అంబర్‌పేటకు కాలేరు వెంకటేశ్, మేడ్చల్‌కు ఎంపీ మల్లారెడ్డి, మల్కాజ్‌గిరికి మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి నుంచి సుంకె రవిశంకర్, వరంగల్‌తూర్పు నుంచి నన్నపునేని నరేందర్, హుజూర్నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, కోదాడ నుంచి వేనేపల్లి చందర్రావు, వికారాబాద్ నుంచి టి.విజయ్‌కుమార్ చార్మినార్ నుంచి దీపాంకర్‌పాల్ ను కేసీఆర్ ఖరారు చేశారు.
ఈ రోజు సాయంత్రం.. టీఆర్ఎస్ భవన్ లో అభ్యర్థులందరితో సమావేశం అవుతున్నారు. వీరికి కూడా పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. 119 మంది అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్స్ పంపిణీ చేయనున్నారు. 12 స్థానాల్లో అసంతృప్తికి గురయ్యే నేతలను.. గుర్తించి బుజ్జగించే బాధ్యతను పార్టీ నేతలకు కేసీఆర్ అప్పగించారు. స్వయంగా తను కూడా కొంత మందితో మాట్లాడారు. ఈ రోజు కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నేడు ప్రచార సభ నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతున్నారు. 15 వేల మందిని ఈ సమావేశానికి ఆహ్వానించారు. అక్కడ్నుంచి నేరుగా.. తెలంగాణ భవన్‌కు వచ్చి అభ్యర్థులతో సమావేశం అవుతారు.
బీఫామ్స్ పంపిణీ పూర్తి చేస్తే.. ఇక కేసీఆర్ పూర్తిగా.. ప్రచారం… ఎన్నికల వ్యూహాల మీదే దృష్టి కేంద్రీకరించనున్నారు. మేనిఫెస్టోను కూడా… ఈ రోజే విడుదల చేసే అవకాశం ఉందని… టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కానీ… కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను చూసిన తర్వాత… విడుదల చేస్తే బాగుంటుందని… కొంత మంది నేతలు సలహాలివ్వడంతో.. ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.