కల్వకుంట్ల తారక రామారావు.. కేటీఆర్ పుట్టిన రోజు నేడు. యువనేతగా.. ప్రభుత్వాన్ని పరోక్షంగా నడిపిస్తున్న నేతగా.. ఆయన ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. సూపర్ పవర్‌ఫుల్‌గా కేటీఆర్ అంటే… అందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉండటంలో ప్రత్యేకత లేదు. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలకు… ఆయన ఆల్ ఇన్ వన్. అయితే.. పుట్టిన రోజు ప్రతీ సారి వస్తుంది. కానీ ఈ సారి మాత్రం… ఎప్పుడూ కనిపించనంత సందడి కనిపిస్తోంది. కొద్ది రోజుల నుంచి ఆయన బర్త్‌డే ఏర్పాట్లను పార్టీ నేతలు ఘనంగా చేయడం ప్రారంభించారు. పార్టీ నేతల ఉత్సాహాన్ని చూసిన కేటీఆర్ కూడా.., కరోనా కారణంగా.., ఇబ్బందులు రాకుండా ఉండటానికి… వారికి మరో రకమైన దిశానిర్దేశం చేశారు. ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సాయం చేసి.. ఆ ఫోటోలను.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసే.. “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే.. టీఆర్ఎస్ నేతలు తాము చేయాలనుకున్నది చేయకుండా ఉండరు మరి.
పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు… బ్యానర్లు.. సోషల్ మీడియాలో హడావుడితో పాటు.. నేతల పొగడ్తల ప్రకటనలు రెండు, మూడు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. రాజకీయాల్లో తలపండిపోయిన తలసాని లాంటి వాళ్లు… కేటీఆర్… యువనేతగా ప్రపంచానికి ఆదర్శంగా మారారని.. కీర్తించడం ప్రారంభించారు. టీఆర్ఎస్లో చిన్నా.. పెద్దా తేడా లేదు.. అందరూ.. కేటీఆర్‌ను… తమదైన భాషలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. టీఆర్ఎస్లో ఈ హడావుడి వెనుక.. చాలా స్పష్టంగా కనిపిస్తోంది.. పట్టాభిషేక సందడేనని.. చాలా మంది గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇటీవలి పరిణామాలు చూస్తే… కేటీఆర్‌కు త్వరలోనే.. సీఎంగా ప్రమోషన్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ ఇటీవలి కాలంలో.. ఫామ్‌హౌస్‌కే ఎక్కువగా పరిమితం అవుతున్నారు. ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి… పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నారని.. చెబుతున్నారు. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే ప్రారంభించేశారన్న చర్చ కూడా టీఆర్ఎస్లో జరుగుతోంది. అందుకే… ఇటీవలి కాలంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కేటీఆర్ నడిపిస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడో అత్యవసరం అయితే తప్ప సమీక్షలు చేయడం లేదు. చురుగ్గా తిరుగుతూ.. కేటీఆర్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కేటీఆర్‌కు పట్టాభిషేక యోగ సమయం దగ్గర పడటం వల్లనేనంటున్నారు.
అంతే కాదు… కేసీఆర్‌కు వాస్తుపై నమ్మకం ఎక్కువ. అందుకే.. కొత్త సెక్రటేరియట్ కట్టిస్తున్నారంటున్నారు. కుమారుడికి సీఎం పదవి అప్పగించడానికి ముందే… సెక్రటేరియట్‌ను కంప్లీట్ చేయాలని… హుటాహుటిన భవనాన్ని…నిర్మిస్తున్నారని అంటున్నారు. దీనిపై.. రేవంత్ రెడ్డి లాంటి నేతలు విమర్శలు చేస్తున్నారు. కొడుకు కోసమే.. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారని అంటున్నారు. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. తెలంగాణ రాజకీయాల్లో “రైజింగ్ సన్” కేటీఆర్..! అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదు… ! హ్యాపీ బర్త్ డే కేటీఆర్..!