ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్ మీడియా టీములదే హవా. నిజమో.. అబద్దమో.. జనం నమ్మోలా చెప్పడమే ఇప్పుడు అసలు టాస్క్. ఈ విషయంలో బీజేపీ కాస్త ముందే ఉంది. టీఆర్ఎస్ కూడా తక్కువేమీ కాదు. ఇప్పటి వరకూ బీజేపీ సోషల్ మీడియా ప్రచారం విషయంలో కాస్త సహనంతో ఉన్న టీఆర్ఎస్.. ఇక నుంచి ఊరుకునేది లేదని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ నేతలు పెడుతున్న పోస్ట్‌లు అభ్యంతరకరంగా ఉంటున్నాయని వాటిపై కేసులు పెట్టాలని నిర్మయించుకున్నారు.
బీజేపీలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారిలో నిజామాబాద్ ఎంపీ ఒకరు. ఆయన లాంగ్వేజ్ కూడా ఘాటుగానే ఉంటుంది. దీంతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచితంగా మాట్లాడారని ఆయనపై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ వ్యక్తులు, గ్రూప్‌ల పేరిట ఏర్పాటు చేసిన ఖాతాలను గుర్తించి పోలీసు కేసులు పెట్టే పనుల్లో ఉన్నారు.
కేసీఆర్, కేటీఆర్, ఇతర ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యపదజాలంతో పోస్టులు చేస్తున్నారని వారిపై ఫిర్యాదులు చేస్తున్నారు. తెలంగాణలో అధికారం చేతుల్లో ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేియంచి… అసత్య ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నాని బ్లాక్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేయిస్తున్నారు. దీంతో బీజేపీకి చెందిన పలు ఖాతాలు ఇప్పటికే బ్లాక్ అయ్యాయి. అదే సమయంలో టీఆర్ెస్ సోషల్ మీడియా మాత్రం పూర్తి స్థాయిలో విజృంభిస్తోంది. కేటీఆర్ కుమారుడిపై పోల్ పెట్టారని .. తీన్మార్ మల్లన్న భార్యపై అత్యంత అసభ్యకరంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ పోస్ట్ పెట్టారు. కానీ అలాంటివి మాత్రం.. టిట్ ఫర్ టాట్గానే పరిగణిస్తారు కానీ కేసులు దాకా వెళ్లవు.