తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ లేదు. అయినప్పటికీ ఆ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్ని ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం ఎందుకు ? ఇదే డౌట్ చాలా మంది బీఆర్ఎస్ నేతలకు వస్తోంది. టీఆర్ఎస్ ఉందని అనిపించేలా వేడుకలు చేయడం వెనుక ఓ ప్లాన్ ఉందని బీఆర్ఎస్ అనే భావన రాకుండా చేయడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు.
టీఆర్ెస్ కు.. తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పేజీలు ఉంటాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జలదృశ్యంలో ప్రాణం పోసుకున్న పార్టీ… లక్ష్యం సాధిందింది. కేసీఆర్ మరో లక్ష్యం కోసం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. దాంతో ఆ పార్టీ చరిత్రలో కలిసిపోయినట్లయింది. అయినప్పటికీ ఆవిర్భావ సభలు… ప్లీనరీలు నిర్వహిస్తున్నారు. మరి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం ఎందుకన్న చర్చ కూడా వస్తుంది. ఎన్నికలకు ముందు ఇలాంటి గందరగోళం బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతోంది.
టీఆర్ఎస్ అనేది ప్రజల సెంటిమెంట్ మారింది. అదే భావన ప్రజల్లో ఉండాలంటే… టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్ని బీఆర్ఎస్ ద్వారా నిర్వహించాలన్న ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు. నేతల్లో తప్ప… జనంలో బీఆర్ఎస్ పేరు కన్నా టీఆర్ఎస్ అనే చర్చించుకునేలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా ప్రజల్లో ఇది తమ పార్టీ అనే భావన తగ్గకుండా చేయడానికేనన్న వాదన వినిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడమెందుకు.. ఇలా లేని పార్టీకి ఆవిర్భావ వేడుకలు చేయడమెందుకన్న విమర్శలు సహజంగానే ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.