తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగింది. దీనికి కారణం… టీఆర్ఎస్ విమర్శలు చేయడం… బీజేపీ ప్రతి విమర్శలు చేయడం.. తర్వాత రెండు పార్టీల మధ్య … వ్యక్తిగత విమర్శలు.. కామన్‌గా మారిపోవడం వంటి అంశాలతో పోటీ.. తమ రెండు పార్టీల మధ్యే జరుగుతోందన్న అభిప్రాయం కల్పించడానికి వారు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఈ విషయంలో వారు సక్సెస్ అయ్యారు. దుబ్బాకలో కాంగ్రెస్ తరపున ముత్యం రెడ్డి కుమారుడు బరిలో ఉన్నా… ప్రజలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పోరుకు ఫిక్సయిపోయారు. పోరాటం వారిద్దరి మధ్యనే జరిగింది. తర్వాత అదే వ్యూహం… గ్రేటర్, శాసనమండలి ఎన్నికల్లోనూ అమలు చేశారు., గ్రేటర్లో బీజేపీకి… శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్కు కలిసి వచ్చింది.
కానీ నాగార్జున సాగర్‌కు వచ్చే సరికి బీజేపీ వెనుకబడిపోయింది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సీన్ మారిపోయింది. బీజేపీ సాగర్ విషయంలో దూకుడుగా ఉండలేకపోవడమే దీనికి కారణం. సాధారణంగా… బీజేపీ బలం ఉన్నా లేకపోయినా మందుగా అభ్యర్థిని ఖరారు చేసి.. వివాదాస్పద ప్రకటనలతో.. హైప్ తెచ్చుకునేది. కానీ ఈ సారి సాగర్‌లో నామినేషన్లు ముగుస్తున్న సమయంలోనూ అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. జానారెడ్డి బలమైన అభ్యర్థిగా ఉండటంతో టీఆర్ఎస్ ఆయనపైనే దృష్టి కేంద్రీకరించింది.
కాంగ్రెస్ పార్టీ మరింత చురుకుగా వ్యవహరించి.. టీఆర్ఎస్పై విరుచుకుపడితే… సీన్ దుబ్బాక తరహాలో మారిపోతుంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సీన్‌ను మార్చుకోగలిగితే.. బీజేపీకి డిపాజిట్ దక్కడం కష్టమవుతుంది. మారుతున్న ఎన్నికల పరిసస్థితుల్లో ఇప్పుడు ఓటర్లు.. మూడో ఆప్షన్ వైపు చూడటం లేదు. ప్రధాన పోటీదారుల మధ్యనే ఓట్లు వేస్తున్నారు. తమ ఓటు వృధా కావాలనుకోవడం లేదు. ఓ రకంగా ఇప్పుడు.. కాంగ్రెస్ కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. వాడుకుంటుందా.. లేదా అన్నదే కీలకం.