తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వారీగా చూసుకుంటే… లక్షల్లో మెజార్టీలు తెచ్చుకున్న లోక్ సభ నియోజకవర్గాల్లో .,. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో… ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని… అసెంబ్లీ స్థానాల్లో మహాకూటమి అభ్యర్థులు ఆధిక్యత సాధించారు. కానీ.., అక్కడ మాత్రం టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్‌సభ స్థానాల్లో… ఎనిమిది చోట్ల మాత్రమే.. టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నాలుగు చోట్ల బీజేపీ, మరో నాలుగు చోట్ల కాంగ్రెస్ , ఒక చోట ఎంఐఎం విజయం సాధించింది. ఈ ఫలితాలు… నిజంగా ఆశ్చర్యకరమే.
సారు.. కారు.. పదహారు పేరుతో… ఎన్నికల ప్రచారం చేసిన టీఆర్ఎస్కు.. ఏకపక్షంగా.. ఫలితాలు వస్తాయని జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేశాయి. ఎన్నికల ముగిసిన తర్వాత కూడా.. అదే పరిస్థితి కనిపించింది. ఒక్క సీటు అయినా వస్తుందో.. లేదోనని.. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ ఆందోళనకు గురయ్యాయి. కానీ ఫలితాల్లో మాత్రం… టీఆర్ఎస్కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుని మరీ ఓడించాలనుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తమ తమ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో విజయాలు నమోదు చేసారు. బీజేపీ అనూహ్యంగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌తో పాటు సికింద్రాబాద్ సీటులోనూ ఘన విజయం సాధించింది. ఇవి బీజేపీ నేతలు కూడా ఊహించని ఫలితాలు.
టీఆర్ఎస్ అధినేతకు.. ఈ ఎన్నికలో ఓ షాక్ లాంటివే. ఎందుకంటే.. లక్షల్లో మెజార్టీ వస్తుందని.. ఆశించిన కుమార్తె కల్వకుంట్ల కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో… టీఆర్ఎస్ సాధించిన మెజార్టీల ప్రకారం.. ఆమెకు మూడు లక్షలకుపైగానే మెజార్టీ రావాలి. కానీ పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది. ఐదు నెలల్లోనే… బీజేపీ అభ్యర్థి.. టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్… విజయం సాధించారు.