ఈటల రాజేందర్ ఒక్క సారిగా తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు అయ్యారు. తనంతట తాను టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి రాజకీయ పార్టీ పెట్టుకుంటే.. ఆయనను ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన ఇప్పుడు… సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. తన ఆస్తులపై దాడులు చేసినా… మొత్తం కూలగొట్టినా. .. కేసులు పెట్టి అరెస్టులు చేసినా.. ఆత్మగౌరవం కోసం కొట్లాడుతూనే ఉంటానని ఈటల గంభీరంగా ప్రకటించారు. అంతే కాదు.. ఆయన తనకు రాజకీయ కార్యాచరణ ఉందని తన చేతలతోనే చెబుతున్నారు. ఉద్యమంలో భాగం అయిన వారందరి మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నారైలతో విస్తృతంగా సమావేశం అవుతున్నారు. గెలుపు వైపు పయనిస్తానని చెబుతున్నారు. దీంతో ఈటల మధ్యలో కాడి దించేసే నేత కాదని.. పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారని .. ఇతర నేతలకు నమ్మకం కలుగుతోంది. దీంతో ఆయనను కలిసేందుకు ఇతర పార్టీల నేతలూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అసంతృప్త నేతలకు.. ఈటల ముఖ్య నాయుకుడు అయిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు.. ఇతర ముఖ్యనేతలు.. కలుస్తున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి అనే మాజీ ఎమ్మెల్యేతో పాటు… ఉద్యమ కాలం నుంచి క్రియాశీలకంగా ఉంటూ వస్తున్న తుల ఉమ కూడా.. ఈటలతో భేటీ అయ్యారు.
ఈటలతో భేటీ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా.. వీరంతా ఆయన వద్దకు వెళ్తున్నారంటే్… ఇక బిందాస్ అనుకునే పరిస్థితి వస్తే.. ఆయన వద్దకు వచ్చే టీఆర్ఎస్ నేతలకు లెక్క ఉండదని కొంత మంది విశ్లేషిస్తున్నారు. అదే్ సమయంలో ఇతర పార్టీల నేతలకూ ఈటల పెద్ద దిక్కయ్యే సూచనలు నిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్తో పాటు కొంత మంది కాంగ్రెస్ నేతలకూ ఈటల ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఎలా చూసినా.. మొత్తంగా ఈటల ఓ నాయకుడిగా ఎదిగారు. ఈ టెంపోను మెయిన్టెయిన్ చేసి సొంత పార్టీ పెడితే.. అనూహ్యంగా పుంజుకున్నా ఆశ్చర్యం లేదన్న భావన వ్యక్తమవుతోంది.